Varun Tej Lavanya Tripathi : వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి ప్రస్తుతం మ్యారేజ్ లైఫ్‌ను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మిస్టర్ సినిమా షూటింగ్ సమయంలో ఏర్పడిన పరిచయంతో ఆ తర్వాత ప్రేమికులుగా మారి పెళ్లి చేసుకున్నారు. అయితే ఇప్పుడీ జంటకు ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఏర్పడింది. పెళ్లి తర్వాత వీరు ఏం చేసినా, లేదా వీరికి సంబంధించి ఏ చిన్న విషయం తెలిసినా అది సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ అవుతోంది.
అయితే ఇప్పటి వరకు వెండితెరపై కలిసి సందడి చేసిన వరుణ్-లావణ్య జంట తొలిసారి బుల్లితెరపై కలిసి సందడి చేశారు. ఓ సింగింగ్ కాంపిటీషన్ ప్రోగ్రామ్‌కు గెస్ట్లుగా హాజరై ఆడియెన్స్‌కు ఇంట్రెస్టింగ్ కబుర్లు చెబుతూ అలరించారు. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో విడుదలై ఆద్యంతం ఆకట్టుకుంటోంది. ఇందులో వరుణ్ - లావణ్య తమ లవ్ లైఫ్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను తెలియజేశారు.
తామిద్దరు తొలిసారి కలిసినప్పుడు లావణ్య వేసుకున్న డ్రెస్ కలర్ బ్లూ కలర్ డెనిమ్ జాకెట్ అని చెప్పారు వరుణ్ తేజ్. తమ ఫస్ట్ హాలీడే ట్రిప్ కోసం థాయ్‌లాండ్ వెళ్లినట్లు గుర్తుచేసుకున్నారు. ఇక వరుణ్‌కు బిర్యానీ అంటే ఫేవరెట్ ఫుడ్ అని చెప్పింది లావణ్య. అలా ఇంకా పలు విషయాలను తెలియజేసింది. ఆద్యంతం నవ్వులుగా సాగిన ఈ ప్రోమో ప్రస్తుతం ప్రేక్షకులను బాగా అలరిస్తోంది.