Upcoming Movies Tollywood :ఈ ఏడాది సంక్రాంతి, సమ్మర్ సీజన్ బాక్సాఫీస్ ముగిసింది. ముగ్గుల పండక్కి పెద్ద సినిమాలు రిలీజ్ అయినా వేసవి చప్పగా సాగింది. ఐపీఎల్, ఎన్నికల పోలింగ్, రిజల్ట్స్ వల్ల పెద్ద సినిమాలన్నీ వాయిదా పడిపోయాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లో జూన్ 4తో ఎన్నికల హడావుడి ముగియనుంది. ఆ తర్వాత వరుసగా ఏడు నెలల పాటు బాక్సాఫీస్ ముందు ఏడు భారీ సినిమాల సందడి కనిపించనుంది. అవేంటో తెలుసుకుందాం.
- పాన్ ఇండియ హీరో ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ చిత్రంతో ఈ సందడి మొదలు కానుంది. ఇప్పటికే ప్రమోషన్స్ మొదలైపోయాయి. జూన్ 27న ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా గ్రాండ్గా రానుంది. నాగ్ అశ్విన్ దర్శకుడు. అమితాబ్ బచ్చన్ , కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ వంటి స్టార్స్ సినిమాలో నటిస్తున్నారు.
- కల్కి తర్వాత దిగ్గజ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న ఇండియన్ 2 సినిమా విడుదల కానుంది. జులై 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. కమల్ హాసన్ ఆల్ టైమ్ హిట్ భారతీయుడు చిత్రానికి సీక్వెల్ ఇది.
- ఆగస్టులో పుష్ప 2 మేనియా మొదలు కానుంది. సుకుమార్ - అల్లు అర్జున్ కాంబోలో రానున్న ఈ చిత్రం ఆగస్ట్ 15న గ్రాండ్గా రానుంది. రష్మిక మందన హీరోయిన్. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఈ మూవీ కోసం ఎదురుచూస్తున్నారు.
- పుష్ప 2 తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సెప్టెంబర్ 27న విడుదల కానుంది. సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో పవన్ గ్యాంగ్స్టర్గా కనిపించనున్నారు. ప్రియాంక మోహన్ హీరోయిన్. డీవీవీ దానయ్య నిర్మాత.
- అనంతరం అక్టోబర్ 10న దసరా కానుకగా ఎన్టీఆర్ దేవర మొదటి భాగం విడుదల కానుంది. కొరటాల శివ దర్శకుడు. ఈ చిత్రంతోనే జాన్వీ కపూర్ హీరోయిన్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుంది. దీనిపై నందమూరి అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అలానే ఈ సినిమా విజయం కొరటాలకు ఎంతో కీలకం.
- దేవర తర్వాత అక్టోబర్లోనే రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ వచ్చే అవకాశముందని దిల్ రాజు కూతురు హన్షిత చెప్పింది. దీనిని దిగ్గజ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్నారు. ఇప్పటివరకు ఒక్క సాంగ్ మాత్రమే రిలీజ్ చేశారు.
- ఇక ఈ ఏడాదిని ఘనంగా పవర్ స్టార్ ముగించనున్నారు. డిసెంబర్‌లో పవన్ నటించనున్న హరిహర వీరమల్లు చిత్రం రిలీజ్ చేయబోతున్నారు. రిలీజ్ డేట్ ఇంకా ఖరారు కాలేదు. అలా ఈ ఏడాది రాబోయే 7 నెలల్లో 7 భారీ చిత్రాలు ప్రేక్షకుల్ని అలరించనున్నాయి. కానున్నాయి.