తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'స్క్విడ్​ గేమ్'​ టు 'బేబీ జాన్'​ - ఈ వారం థియేటర్​ / ఓటీటీలో అలరించనున్న టాప్ కంటెంట్ ఇదే! - UPCOMING MOVIES IN THEATRES AND OTT

'స్క్విడ్​ గేమ్'​ టు 'బేబీ జాన్'​ - ఈ వారం థియేటర్​ / ఓటీటీలో విడుదల కానున్న సినిమాలు ఇవే!

Upcoming Movies In Theatres And OTT
Upcoming Movies In Theatres And OTT (Getty Images)

By ETV Bharat Telugu Team

Published : Dec 23, 2024, 10:47 AM IST

2024 ఎండింగ్ వచ్చేసింది. ఇక అందరూ తమ న్యూ ఇయర్ రెజల్యూషన్స్​తో కొత్త ఏడాదిని ప్రారంభించాలని ఎంతో ఎగ్జైటెడ్​గా ఎదురుచూస్తుంటారు. అయితే ఈ ఇయర్ ఎండింగ్​లోపు పలువురు స్టార్స్ కూడా తమ సినిమాలు / సిరీస్​లతో అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఇంతకీ ఆ స్టార్స్ ఎవరు? ఆ సినిమాలు ఏవంటే?

'బరోజ్‌ 3 D' :మలయాళ స్టార్ హీరో మోహన్​ లాల్ కీలక పాత్ర పోషించిన చిత్రం ఇది. ఆయన టైటిల్‌ పాత్రలో నటిస్తూ స్వయంగా తెరకెక్కించిన బహుభాషా చిత్రం కూడా ఇదే కావడం విశేషం. ఈ నెల 25న మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్‌ ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ చిత్రం. 'గార్డియన్‌ ఆఫ్‌ డి గామాస్‌ ట్రెజర్‌' అనే ఓ నవలను ఆధారంగా చేసుకుని ఈ ఫాంటసీ స్టోరీని సిద్ధం చేశారు మేకర్స్.

శ్రీకాకుళం షెర్లాక్‌హోమ్స్‌ :తన కామెడీ టైమింగ్​తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే నటుడువెన్నెల కిశోర్‌ ఈ సారి డిఫరెంట్ కాన్సెప్ట్​తో ఆడియెన్స్​ను అలరించేందుకు సిద్ధమయ్యారు. ఆయన ప్రధాన పాత్రలో రైటర్‌ మోహన్‌ తెరకెక్కించిన 'శ్రీకాకుళం షెర్లాక్‌హోమ్స్‌'లో ఆయన కీ రోల్ ప్లే చేస్తున్నారు. ఈ నెల 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

మాక్స్ :శాండల్​వుడ్ స్టార్ హీరో సుదీప్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ 'మాక్స్'. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్​తో అభిమానుల్లో భారీ అంచనాలు పెంచేసిన ఈ చిత్రం డిసెంబర్ 27న తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది.

బేబీ జాన్‌ :కీర్తి సురేశ్​, వరుణ్​ ధావన్ లీడ్​ రోల్స్​లో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీ 'బేబీ జాన్‌'. క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌ 25న ఈ మూవీ విడుదల కానుంది. తమిళంలో సూపర్ హిట్ టాక్ అందుకున్న 'తెరి'కి రీమేక్​గా ఈ చిత్రం రూపొందింది.

ఈ వారం ఓటీటీలో విడుదల కానున్న సినిమాలు/వెబ్‌సిరీస్​లు ఇవే!
అమెజాన్‌ ప్రైమ్‌
సింగం అగైన్‌ (హిందీ) డిసెంబరు 27
థానర (మలయాళం) డిసెంబరు 27

నెట్‌ఫ్లిక్స్‌
ది ఫోర్జ్‌ (హాలీవుడ్‌) డిసెంబరు 22
ఓరిజిన్‌ (హాలీవుడ్‌) డిసెంబరు 25
స్క్విడ్ గేమ్ 2 (కొరియన్) డిసెంబర్ 26​
సార్గవాసల్‌ (తమిళ) డిసెంబరు 27
భూల్‌ భూలయ్య3 (హిందీ) డిసెంబరు 27

జీ5
ఖోజ్‌ (హిందీ) డిసెంబరు 27

జియో సినిమా
డాక్టర్స్‌ (హిందీ సిరీస్‌) డిసెంబరు 27

డిస్నీ+హాట్‌స్టార్‌
వాట్‌ ఇఫ్‌ ? 3 (యానిమేషన్‌ సిరీస్‌) డిసెంబరు 22
డాక్టర్‌ వూ (హాలీవుడ్‌ మూవీ) డిసెంబరు 26

మనోరమా మ్యాక్స్‌
ఐయామ్‌ కథలన్‌ (మలయాళం) డిసెంబరు 25
పంచాయత్‌ జెట్టీ (మలయాళ చిత్రం) డిసెంబరు 24

లయన్స్‌ గేట్‌ ప్లే
మదర్స్‌ ఇన్‌స్టింక్‌ (హాలీవుడ్‌) డిసెంబరు 27

డిస్కవరీ ప్లస్‌
హ్యారీపోటర్‌ విజడ్జ్‌ ఆఫ్‌ బేకింగ్‌ (వెబ్‌సిరీస్‌) డిసెంబరు 25

'పుష్ప 2' ఓటీటీ రిలీజ్​పై మూవీటీమ్ క్లారిటీ - విడుదల​ అప్పుడే

హృతిక్​ ఫ్యామిలీపై స్పెషల్ డాక్యుమెంటరీ - 'ది రోషన్స్'​ ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే?

ABOUT THE AUTHOR

...view details