Upasana Second Pregnancy : ఉపాసన కామినేని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓ వైపు అపోలో హాస్పిటల్ బాధ్యతలు మరోవైపు మెగా కోడలిగా కుటంబ బాధ్యతలు చూసుకుంటూ లైఫ్‌ను బ్యాలెన్స్ చేస్తోంది. తమ కుటుంబ వారసత్వాన్ని నిలబెడుతూ వైద్య రంగంలో ముందుకెళ్తోంది. సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. తాజాగా ఈమె మరోసారి ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పింది.
వివరాల్లోకి వెళితే. రామ్ చరణ్ ఉపాసన పెళ్లి చేసుకున్న దాదాపు 10 ఏళ్ల తర్వాత క్లీంకారకు జన్మనిచ్చారు. పిల్లలు కనే విషయంలో ఈ జంటకు ఎన్ని ప్రశ్నలు ఎదురైనా సహనంతో ఉన్నారు. సమయం చూసుకుని గతేడాది ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఆ పాపకు క్లీంకార అని నామాకరణం చేసుకుని సంబరాలు జరుపుకున్నారు. మెగా అభిమానులు కూడా పండగ చేసుకున్నారు.
అయితే తాజాగా మెగా ఫ్యాన్స్‌కు ఉపాసన మరో పండగ లాంటి వార్తను అందించింది! తాజాగా ఓ కార్యక్రమానికి హాజరైన ఉపాసన రెండో బిడ్డకు జన్మనిచ్చే ప్లాన్‌పై మాట్లాడింది. ఇంకా ఆ కార్యక్రమంలో మహిళల ఆరోగ్యం గురించి కూడా చెప్పింది. మహిళలు ఆరోగ్యంపై పూర్తి దృష్టి సారించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పింది. ప్రతి ఒక్కరికి ఆరోగ్యంపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చింది.