Telugu Romantic Movies In OTT : ఒకప్పుడు ఏదైనా సినిమా రిలీజ్ అయిదంటే కచ్చితంగా థియేటర్‌కు వెళ్లి చూడాల్సి వచ్చేది. అయిన ప్రస్తుత రోజుల్లో ఇంటిల్లపాది ఇంట్లోనే కూర్చొని సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు. ఓటీటీల పుణ్యమా అని అంతలా పరిస్థితులు మారిపోయాయి. అయితే వీకెండ్లో మీకు ఇష్టమైన వారితో వీక్షించేందుకు ఐదు తెలుగు రొమాంటిక్ సినిమాలు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. అవేంటి? ఏ ఓటీటీ ఫ్లాట్ ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతున్నాయో? తెలుసుకుందాం పదండి.
హాయ్ నాన్న
శౌర్యువ్ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన సినిమా 'హాయ్ నాన్న'. ఈ మూవీలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించారు. 2023 డిసెంబరులో విడుదలైన ఈ మూవీ మంచి విజయం సాధించింది. తండ్రి, ఆరేళ్ల కూతురు చుట్టూ ఈ మూవీ స్టోరీ తిరుగుతుంది. అలాగే నాటకీయ మలుపులతో ఆద్యంతం ఉత్కంఠగా తెరకెక్కించారు దర్శకుడు. నాని, మృణాల్ మధ్య ఉన్న సాగిన లవ్ సీన్స్ కూడా కూడా సినిమాకు హైలెట్‌గా నిలిచాయి. ఈ మూవీ నెట్ ఫ్లిక్స్‌లో స్క్రీనింగ్ అవుతోంది. రొమాంటిక్, ఎమోషనల్ డ్రామాను ఇష్టపడేవారు ఓసారి చూసేయండి మరి.
గీతా గోవిందం
పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'గీతా గోవిందం'. ఈ మూవీలో విజయ్ దేవరకొండ, రష్మిక మంధన హీరో, హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీలో వీరిద్దరి మధ్య సాగే రొమాంటిక్ సీన్స్ సినిమాకే హైలెట్‌గా నిలిచాయి. అందుకే ఈ మూవీ తెలుగులో అత్యుత్తమ రొమాంటిక్ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. అలాగే విజయ్, రష్మిక గొడవ పడే సన్నివేశాలు ప్రేక్షకుల్ని అలరించాయి. ఫ్యామిలీ ఎమోషన్‌ను 'గీతా గోవిందం'లో ఇనుమడింపజేశారు దర్శకుడు పరశురామ్. ఈ మూవీ జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది.
సీతారామం
హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన మరో క్లాసిక్ చిత్రం 'సీతారామం'. ఇందులో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ హీరోహీరోయిన్లుగా నటించారు. 2022లో పీరియాడికల్ రొమాంటిక్ డ్రామాగా విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ అయ్యింది. సీతారామం మూవీ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.