భక్తుల నోట రాముని పాట - టాలీవుడ్లో ఇప్పటికీ ఈ సాంగ్స్ ఎవర్గ్రీనే! - టాలీవుడ్ సినిమాల్లోశ్రీ రామునిపాటలు
Tollywood Songs On Shri Ram : అయోధ్యలో శ్రీ రాముని ప్రాణ ప్రతిష్ఠకు అంతా సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు తెలుగు వెండితెరపై అలరించిన శ్రీ రాముని పాటలను ఓ సారి చూద్దామా
Published : Jan 21, 2024, 10:55 AM IST
|Updated : Jan 21, 2024, 11:00 AM IST
Tollywood Songs On Shri Ram :'అంత రామ మయం' అన్న పాటను మనం ఎన్నో సార్లు విన్నాం. అయితే మరో రెండు రోజుల్లో దేశమంతా రామమయం కానుంది. అయోధ్య నగరిలో బాల రాముడు కొలువుదీరనున్న వేళ దేశమంతా రామమయం కానుంది. పండితులు, ప్రముఖుల సమక్షంలో రామ మందిర ప్రాణప్రతిష్ఠ అంగరంగ వైభవంగా జరగనుంది. రామ భక్తుల ఎదురుచూస్తున్న ఆ తరుణం కోసం అయోధ్య సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. ఇప్పటికే రామమందిరం ప్రారంభోత్సవానికి సినీ, రాజకీయ, క్రీడా రంగానికి చెందిన ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. వారందరూ రాముడి దివ్య రూపాన్ని చూసేందుకు కదలి రానున్నారు. ఇలా దేశమంతట పండుగ వాతావరణం నెలకొన్న వేళ అంతా అయోధ్య గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు వెండితెరపై ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసిన శ్రీ రాముడి పాటలు, సినిమాల పాటలు ఏంటో ఓ సారి చూద్దామా.
- రెబల్ స్టార్ ప్రభాస్ లీడ్ రోల్లో రామయాణం ఆధారంగా తెరకెక్కిన సినిమా 'ఆదిపురుష్'. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ రూపొందించిన ఈ చిత్రంలోని పాటలు సంగీత ప్రియులను మరో లోకానికి తీసుకెళ్తాయి. ముఖ్యంగా ఇందులోని 'జై శ్రీ రామ్', 'రామ్ సితా రామ్' పాటలకు మనం తెలియకుండానే అలా కనెక్ట్ అయిపోతాం.
- నందమూరి బాలకృష్ణ -నయనతార కాంబినేషన్లో వచ్చిన శ్రీ రామ రాజ్యం సినిమా ఎంతటి ప్రజాదరణ పొందిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఇందులోని 'జగదానంద కారకా..జయ జానకీ ప్రాణనాయకా' అనే పాట ఇప్పటికీ పలు దేవాలాయల్లో మారుమోగుతూనే ఉంది.
- టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున రామ భక్తునిగా నటించి మెప్పించిన చిత్రం 'శ్రీ రామ దాసు'. భద్రాది గుడి నిర్మాత, రామునికి అపర భక్తుడైన కంచర్ల గోపన్న గురించి తెరకెక్కిన ఈ సినిమాలో అన్ని పాటలు ఆణిముత్యాలే. ముఖ్యంగా 'అంతా రామయం', 'ఇక్ష్వాసకుల తిలక', 'చరణములే నమ్మితీ' పాటలు ప్రేక్షకులను బాగా అలరించింది.
-
అలనాటి అందాల తార శోభన్ బాబు శ్రీరాముడిగా మెరిసిన చిత్రం 'సంపూర్ణ రామాయణం' . ఇందులోని 'రామయ తండ్రి ఓ రామయ తండ్రి' పాట అప్పుట్లో మంచి విజయం సాధించింది. ఈ సినిమాలో ఆద్యంతం రామాణయాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు.
-
సీనియర్ ఎన్టీఆర్ రాముని పాత్రలో కనిపించి ఎన్నో సార్లు ప్రేక్షకులను మురిపించారు. ముఖ్యంగా 'లవకుశ'లో ఆయన నటన అద్భుతం . 'జయ జయ రామా శ్రీరామ', 'శ్రీ రాముని చరితమును తెలిపెదమమ్మ' పాటలు ఇప్పటికీ ఎవర్గ్రీన్గా ఉన్నాయి.