TOLLYWOOD 2024 DEEPAWALI HEROINES : దీపావళికి టాలీవుడ్ బాక్సాఫీస్ స్పెషల్‌గా ముస్తాబవుతోంది. సాయి పల్లవి నటించిన అమరన్, దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్‌తో పాటు మరిన్ని సినిమాలు సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. దివ్వెల్లాంటి కళ్లతో, చిచ్చుబుడ్డుల్లాంటి నవ్వులతో ఈ పండుగ సినిమాలను మరింత ప్రత్యేకం చేసే హీరోయిన్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
మీనాక్షి చౌదరి(LUCKY BHASKAR MEENAKSHI CHAUDHARY) - దుల్కర్ సల్మాన్ చాలా కాలం గ్యాప్ తర్వాత తెలుగులో మంచి సక్సెస్ కొడతానని నమ్మకంగా చెబుతున్న సినిమా లక్కీ భాస్కర్. ఇందులో ఆయనకు హీరోయిన్‌గా నటించారు మీనాక్షి చౌదరి. కథలో ఆమె పాత్ర చాలా కీలకంగా ఉంటుందని టీజర్ చూస్తేనే అర్థమవుతోంది. దీపావళి సందర్భంగా అక్టోబరు 31న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ పై ఈ సినిమాను తెరకెక్కించారు. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించగా, ఈ చిత్రానికి సూర్య దేవర నాగవంశీ, సాయి సౌజన్యలు నిర్మాతలు.
నయన్ సారిక, తన్వీరామ్ - కిరణ్ అబ్బవరం హీరోగా రూపొందిన చిత్రం 'క'. ఇందులో నయన్ సారిక, తన్వీరామ్లు కథానాయికలుగా నటించారు. కథ హీరో చుట్టూనే తిరుగుతున్నా కథాపరంగా సారిక, తన్వీరామ్ల పాత్ర కూడా ఈ సినిమాలో కీలకమట. అక్టోబర్ 31న విడుదల కానున్న ఈ చిత్రానికి సుజీత్, సందీప్‌లు సంయుక్తంగా దర్శకత్వం వహించారు. శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై చింతా గోపాలకృష్ణారెడ్డి నిర్మించారు.
సాయిపల్లవి(AMARAN SAI PALLAVI) -స్టార్ హీరోయిన్ సాయి పల్లవి నటించిన తమిళ సినిమా అమరన్. ఒకేసారి తెలుగులోనూ రిలీజ్ అయ్యేందుకు రెడీ అయింది. బయోగ్రాఫికల్ యాక్షన్ వార్ చిత్రంగా రూపొందించిన ఈ సినిమాలో సాయి పల్లవి ఇందు రెబెక్కా వర్గీస్ పాత్రలో నటించారు. హీరో కార్తీకేయన్ ముకుంద్ రోల్ పోషిస్తుండగా ఆయన భార్య ఇందు పాత్రలో సాయి పల్లవి కనిపిస్తున్నారు. పెరియసామి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా అక్టోబరు 31న విడుదల కానుంది. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా సంయుక్తంగా నిర్మించారు.
ప్రియాంక మోహన్, భూమికా చావ్లా - సరిపోదా శనివారం, గ్యాంగ్ లీడర్ సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన ప్రియాంక మోహన్ లేటెస్ట్ మూవీనే బ్రదర్. పక్కింటి అమ్మాయిలా కనిపించే ప్రియాంకతో పాటు భూమికా చావ్లా కూడా ఇందులో ప్రధాన పాత్ర పోషించారు. జయం రవి హీరోగా రూపొందిన ఈ తమిళ కామెడీ డ్రామాకు ఎం. రాజేశ్ దర్శకత్వం వహించారు. సుందర్ ఆర్ముగం నిర్మాత. దీపావళి సందర్భంగా అక్టోబరు 31న విడుదల కానుంది.
దీపికా పదుకొణె, కరీనా కపూర్(Singham Deepika) -బాలీవుడ్‌కు దీపావళి సందర్భంగా కన్నుల విందు చేయడానికి భారీ తారాగణంతో ముస్తాబవుతోంది సింగం అగైన్. సింగం సిరీస్‌లో ఇదే భారీ బడ్జెట్ చిత్రం. ఇందులో దీపికా, కరీనాతో పాటు అజయ్ దేవగన్, అర్జున్ కపూర్, రణవీర్ సింగ్, టైగర్ ష్రాఫ్, జాకీ ష్రాఫ్, అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్లు ప్రధాన పాత్రల్లో కనిపించారు. దీనికి రోహిత్ శెట్టి దర్శకత్వం వహించి నిర్మాణ బాధ్యతలు కూడా వహించారు. ఆయనతో పాటు రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్, జియో స్టూడియోస్, దేవగన్ ఫిల్మ్స్ సంయుక్తంగా సహ నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ చిత్రాన్ని నవంబరు 1న రిలీజ్ చేయనున్నారు.
రుక్మిణీ వసంత(BHAGEERA RUKMINI VASANTH) - 'కేజీఎఫ్', 'కాంతారా' లాంటి బడా బ్లాక్ బ్లస్టర్ హిట్లు అందించిన హోంబలే ఫిల్మ్స్ బ్యానర్లో వస్తున్న మరో చిత్రం బఘీర. ప్రశాంత్ నీల్ కథ అందించారు. డా.సూరి దర్శకత్వం వహించారు. రుక్మిణీ వసంత హీరోయిన్‌గా నటించారు. భారీ హంగులతో ముస్తాబవుతోన్న ఈ చిత్రంలో ఆమె ఒక్కరే హీరోయిన్. దీపావళి పండుగ రోజు అక్టోబరు 31నే దీనిని రిలీజ్ చేయనున్నారు.
సూర్య 'కంగువా' సినిమా ఎడిటర్ అనుమానాస్పద మృతి
మొన్న 'పుష్ప 2'- ఇప్పుడు 'గేమ్‌ఛేంజర్' - రికార్డ్ ధరకు హిందీ రైట్స్!