Tollywood Celebrities Marriages 2024 :2024 సంవత్సరం ముగుస్తోంది. మరో నాలుగు రోజుల్లో కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్పబోతున్నాం. అయితే ఈ ఏడాది కొందరు సినీ ప్రముఖులకు తీపీ జ్ఞాపకాలు అందించింది. పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు తమ బ్యాచిలర్ లైఫ్‌కు ఫుల్స్టాప్ పెట్టేసి, కొత్త జీవితం ప్రారంభించారు. మరి ఈ ఏడాది వివాహ బంధంలోకి అడుగుపెట్టిన స్టార్లు ఎవరో చూద్దాం
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఈ ఏడాది వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. బాలీవుడ్ హీరో, నిర్మాత జాకీ భగ్నానీతో కొన్నేళ్ల పాటు ప్రేమలో ఉన్న ఆమె 2024 ఫిబ్రవరిలో అతడిని పెళ్లి చేసుకున్నారు.
- తమిళ్ స్టార్ నటులు శరత్ కుమార్- రాధిక కుమార్తె వరలక్ష్మి శరత్ కుమార్ కూడా తన ప్రియుడు నికోలయ్ సచ్దేవ్ను వివాహమాడారు. 2024 మార్చిలో ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈ జంట, జులైలో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వరలక్ష్మి తెలుగులో 'వీర సింహారెడ్డి', 'హనుమాన్' వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నారు.
- టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం,తన సహనటి రహస్య గోరఖ్‌తో కొన్నేళ్లు ప్రేమాయణం నడిపించారు. ఈ ఏడాది ఈ జంట పెళ్లి పీటలెక్కింది. ఆగస్టులో వీరి విహహం గ్రాండ్‌గా జరిగింది. ఇక పెళ్లి తర్వాత 'క' సినిమాతో కిరణ్ మంచి విజయం దక్కించుకున్నారు.
- లవర్‌బాయ్ సిద్ధార్థ్ కూడా ఈ ఏడాది పెళ్లి పీటలెక్కారు. హీరోయిన్ అదితి రావు హైదరితో కొంత కాలంగా ప్రేమలో ఉన్న సిద్ధార్థ్ 2024 సెప్టెంబర్‌లో ఆమె మెడలో మూడుముళ్లు వేశారు. వీరి వివాహం వనపర్తిలోని ఓ గుడిలో జరిగింది.
- టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగచైతన్య, నటి శోభిత దూళిపాళ్లతో ప్రేమాయణం సాగించి ఈ ఏడాది పెళ్లి పీటలెక్కారు. కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట, ఆగస్టులో సడెన్‌గా నిశ్చితార్థం చేసుకొని ఈ జంట షాకిచ్చింది. డిసెంబర్ తొలి వారంలో వీరి పెళ్లి గ్రాండ్‌గా జరిగింది. సినీ, రాజకీయ ప్రముఖులు ఈ వివాహానికి హాజరయ్యారు.
- మహానటి ఫేమ్ కీర్తి సురేశ్ తన ప్రేమ విషయాన్ని బయటపెట్టి ఫ్యాన్స్‌కు షాకిచ్చారు. తన చిన్నానటి మిత్రుడు ఆంటోనీ తట్టిల్‌తో 15ఏళ్లు రహస్యంగా ప్రేమాయణం సాగించిన కీర్తి ఈనెల 12న గోవాలో పెళ్లి చేసుకున్నారు.
వీళ్లు కూడా
'లై' సినిమా హీరోయిన్ మేఘా ఆకాశ్ కూడా బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్ బై చెప్పేశారు. ఆమె రాజకీయ నేపథ్యం ఉన్న విష్ణు అనే వ్యక్తిని సెప్టెంబర్‌లో పెళ్లాడారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుబ్బరాజు సడెన్‌గా పెళ్లి అనౌన్స్ చేసి షాకిచ్చారు. ఆయన స్రవంతి అనే అమ్మాయిని నవంబర్‌లో వివాహం చేసుకున్నారు.