Tollywood Actors Love Marriages: ఏదైనా సినిమా జనాల్లో క్లిక్ అయ్యిందంటే చాలు అందులో యాక్ట్ చేసిన హీరోహీరోయిన్లు జంట బాగుందని మెచ్చుకుంటారు. వాళ్లిద్దరూ మళ్లీ కలిసి నటిస్తే బాగుండూ అని కోరుకుంటారు అభిమానులు. అయితే ఆన్ స్క్రీన్‌పై ఉండే సెలబ్రిటీలు ఆఫ్ ది స్క్రీన్‌లోనూ అదేవిధంగా ఉంటారనుకుంటే పొరపడినట్లే. చాలావరకు ఇండస్ట్రీకి సంబంధం లేని వ్యక్తులను పెళ్లి చేసుకుంటారు.
అయితే కొందరు ఇందుకు భిన్నంగా ఉంటారు. స్క్రీన్ షేర్ చేసుకున్న వాళ్లతోనే లైఫ్ షేర్ చేసుకోవాలని అనుకొని షూటింగ్ సమయంలో ప్రేమలో పడతారు. అలా ప్రేమించి పెళ్లి చేసుకున్న తారలు మన టాలీవుడ్లో చాలా మంది ఉన్నారు. రీసెంట్గా వివాహం చేసుకున్న వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి నుంచి ఎన్నో జంటలు ఉన్నాయి. నేడు వాలంటైన్స్ డే సందర్భంగా ప్రేమ పెళ్లి చేసుకున్న జంటలను వారి లవ్ స్టోరీలపై ఓ లుక్కేద్దాం.
నాగార్జున- అమల:టాలీవుడ్ కింగ్నాగార్జున- అమలది కూడా ప్రేమ వివాహమే. 'శివ' సినిమాతో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. వీరికి అఖిల్ జన్మించారు.
జీవిత- రాజశేఖర్: ఈ జంట గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరంలేదు. నిత్యం వార్తల్లో ఉంటారు. ఈ ప్రేమ పెళ్లి అంతా విచిత్రంగానే జరిగింది. ఓ తమిళ డైరెక్టర్ తన సినిమాకోసం రాజశేఖర్‌కు జోడీగా జీవితను ఎంచుకున్నారు. ఆ తర్వాత వీరిద్దరు కలిసి 'తలంబ్రాలు' మూవీలో కలిసి నటించారు. అప్పుడే వారి మధ్య ప్రేమ చిగురించింది. ఇక 'ఆహుతి' సినిమా సమయంలో గాయపడ్డ రాజశేఖర్‌ను జీవిత దగ్గరుండి చూసుకున్నారు. రాజశేఖర్‌పై జీవితకు ఉన్న ప్రేమను అర్థం చేసుకున్న వారి కుటుంబ సభ్యులు వీరి పెళ్లికి అంగీకరించి, 1991 చెన్నైలో వివాహం జరిపించారు. వీరికి శివాణి, శివాత్మిక అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
శ్రీకాంత్- ఊహ:టాలీవుడ్లో శ్రీకాంత్- ఊహ జంట అందరికీ తెలిసే ఉంటారు. వీరు 'ఆమె' సినిమా షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డారు. తర్వాత వీరిద్దరు కలిసి 4 సినిమాల్లో నటించారు. ఆలా మరింత దగ్గరైన ఈ జంట తన, ఇంట్లో జరిగే ప్రతి ఫంక్షన్ శ్రీకాంత్ ఊహను ఆహ్వానించేవారు. అలా శ్రీకాంత్ ఫ్యామిలీకి ఊహ దగ్గరయ్యారు. దీంతో ఇరు కుటుంబాల అంగీకారంతో శ్రీకాంత్- ఊహ 1997లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు.
మహేశ్ బాబు- నమ్రత:2000వ సంవత్సరంలో వచ్చిన 'వంశీ' సినిమాతో మహేశ్ బాబు- నమ్రత శిరోద్కర్ మధ్య పరిచయం ఏర్పడింది. అప్పుడే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. 5ఏళ్ల తర్వాత 2005లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరికి కుమారుడు గౌతమ్, కుమార్తె సితారా ఉన్నారు.
పవన్ కల్యాణ్- రేణుదేశాయ్:'బద్రి', 'జానీ' సినిమాలో కలిసి నటించిన పవన్- రేణుదేశాయ్ అప్పుడే ప్రేమలో పడ్డారు. కొన్నాళ్లు డేటింగ్ చేసిన తర్వాత కుమారుడు అకీరానందన్ పుట్టాడు. తర్వాత పవన్- రేణుదేశాయ్ వివాహం జరిగింది. ఆ తర్వాత వీరిద్దరు విడాకులు తీసుకున్నారు.