తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

యాక్షన్​ సినిమాలంటే ఇష్టమా? OTTల్లో ఉన్న ఈ 7 థ్రిల్లర్స్ డోంట్ మిస్! - Action Movies In OTT - ACTION MOVIES IN OTT

Tollywood Action Movies In OTT : మీకు యాక్షన్ సినిమాలంటే ఇష్టమా? వీకెండ్స్​లో ఇంట్లోనే చిల్ అవుతూ మూవీస్​ చూడాలనుకుంటున్నారా? అయితే ఈ లిస్ట్​ను ఓ లుక్కేయండి

Tollywood Action Movies In OTT
Tollywood Action Movies In OTT (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Sep 21, 2024, 5:01 PM IST

Tollywood Action Movies In OTT : కామెడీ జోన్, హర్రర్ జోన్, రొమాంటిక్ ఇలా ఎన్ని జానర్లు ఉన్నా యాక్షన్ థ్రిల్లర్స్‌కు కాస్త క్రేజ్ ఎక్కువే. సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ప్రతి హీరో ఒక్క హిట్ యాక్షన్ మూవీ అయినా చేయాలని కలలు కంటుంటారు. ఈ సినిమాలే హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తుంటాయి. అందుకే ఈ కేటగిరీకి అంతటి పాపులారిటీ మరి. ఇంతటి ఎగ్జైట్మెంట్ ఇచ్చే సినిమాలు థియేటర్లోనే చూడాలా? వేరే ఛాయీస్ లేదా అనుకుంటున్నారా? ఇదిగో మీ కోసం ఓటీటీలో అందుబాటులో ఉండే టాప్ 7 తెలుగు యాక్షన్ థ్రిల్లర్స్..

గూఢచారి (2018) - అమెజాన్ ప్రైమ్ వీడియో
'ద కింగ్స్ మెన్ సీక్రెట్ సర్వీస్'కు ప్రేరణగా అడవి శేష్ ఈ సినిమాను రూపొందించారు. తన తండ్రి అడుగుజాడల్లో నడవాలని కోరుకున్న ఓ వ్యక్తి తాను కూడా గూఢచారిగా ఎలా సక్సెస్ అయ్యాడో సినిమాలో చూడొచ్చు.

ఈగల్ (2024) - అమెజాన్ ప్రైమ్ వీడియో
రైతుగా బతికే ఓ వ్యక్తి తుపాకీతో ఫైర్ చేస్తాడు. యుద్ధానికి సంబంధించిన అన్ని నైపుణ్యాలను విజయవంతంగా ప్రయోగిస్తుంటాడు. తాను ఒక సీక్రెట్ మిషన్ మీద ఇవన్నీ చేశాడనేది క్లైమాక్స్‌లో రివీల్ చేస్తాడు. అసలు ఎందుకు చేయాల్సి వచ్చిందనేదే స్టోరీ.

ధ్రువ (2016) - డిస్నీ+ హాట్‌స్టార్
ఐపీఎస్ స్టూడెంట్‌గా ఉన్నప్పటి నుంచే ప్రజలకు సేవ చేసే వ్యక్తి, ఆఫీసర్ అయ్యాక కష్టాల్లో ఇరుక్కొని తన మాస్టర్ మైండ్ తో ఎలా బయటపడ్డాడనేది స్టోరీ.

పుష్ప : ద రైజ్ (2021)- అమెజాన్ ప్రైమ్ వీడియో
అల్లు అర్జున్ ద బెస్ట్ మూవీస్ లో ఒకటి పుష్ప ద రైజ్. కూలీ స్థాయి నుంచి స్మగ్లర్ గా మారిన పుష్ప ఏం చేశాడనేది కథ. ఈ సినిమాకు సీక్వెల్ కూడా మరి కొద్ది రోజుల్లో రానుంది.

దసరా (2023) - నెట్‌ఫ్లిక్స్
హీరోగా నాని, హీరోయిన్​గా కీర్తి సురేశ్ డీగ్లామర్ రోల్‌లో కనిపించి థియేటర్లలో అందరినీ సర్‌ప్రైజ్ చేశారు. ఫ్రెండ్​షిప్​, ప్రేమ, రివెంజ్​ నేపథ్యంలో సాగే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ టాక్ అందుకంది.

వీ (2020) - అమెజాన్ ప్రైమ్ వీడియో
నాని, సుధీర్ బాబుల కాంబినేషన్ వచ్చిన బెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ 'వీ' మూవీ. పోలీసాఫీసర్, మిస్టీరియస్ కిల్లర్ మధ్య జరిగే కథ ఇది.

పోకిరి (2006) - డిస్నీ+ హాట్‌స్టార్
తెలుగు సినిమా స్టైల్ మార్చిన సినిమా 'పోకిరి'. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో మహేశ్ బాబు పండుగాడు అంటూ ఫేమస్​ అయిపోయింది ఈ సినిమాతోనే. ఇలియానాతో లవ్ స్టోరీ నడుపుతూనే తాను ఒక పోలీస్​ ఆఫీసర్ అని తెలియకుండా క్రిమినల్స్​ను అంతం చేస్తుంటాడు. క్లైమాక్స్​లో కొసమెరుపుగా సీక్రెట్ రివీల్ అవుతుంది. ఆద్యంతం సినిమా ఉత్కంఠభరితంగా సాగుతుంది.

ఒక్క సీన్ కోసం రూ.25 కోట్లు ఖర్చు!- ఆ సినిమా ఏదో తెలుసా? - The Most Expensive Movie Scene

సినిమాకు ఇన్సూరెన్స్‌​- 25ఏళ్ల క్రితమే 5 రెట్లు లాభం! - First Indian film to be insured

ABOUT THE AUTHOR

...view details