తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

పోస్టర్​తో ఇంటెన్సిటీ పెంచుతున్న సిద్ధు - 'టిల్లు స్వ్కేర్‌'​ ఎప్పుడు రానుందంటే ? - siddu jonnalagadda tillu square

Tillu Square Release Date : 'డీజే టిల్లు' అంటూ యూత్​ను ఆకట్టుకుని బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్​ క్రియేట్ చేసిన సిద్ధు జొన్నలగడ్డ ఇప్పుడు 'టిల్లు స్వ్కేర్‌​'గా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. తాజాగా ఈ మూవీ రిలీజ్​ డేట్​ను మేకర్స్​ లాక్ చేశారు. ఆ వివరాలు మీ కోసం

Tillu Square Release Date
Tillu Square Release Date

By ETV Bharat Telugu Team

Published : Jan 26, 2024, 11:19 AM IST

Updated : Jan 26, 2024, 12:59 PM IST

Tillu Square Release Date :యంగ్​ హీరో సిద్ధు జొన్నలగడ్డ, మల్లు బ్యూటీ అనుపమ పరమేశ్వరన్​ లీడ్​ రోల్స్​లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ 'టిల్లు స్వ్కేర్‌​'. 'డీజే టిల్లు'కి సీక్వెల్​లా తెరకెక్కుతున్న ఈ మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు మేకర్స్​ తాజాగా ప్రకటించారు. ఇప్పటిదాక పోస్ట్​పోన్​ అవుతూ వచ్చిన ఈ మూవీ మార్చి 29న విడుదలవ్వనున్నట్లు తెలిపారు.

"నో క్యాప్షన్‌, ఓన్లీ యాక్షన్‌. 2024 మార్చి 29లో టిల్లు 2 మీ దగ్గరలోని థియేటర్లలో సందడి చేయనుంది". అంటూ సిద్దు, అనుపమను ఎత్తుకున్న ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇప్పటికీ వచ్చిన సాంగ్స్, టీజర్​తో మూవీ ఆడియెన్స్​లో ఎక్స్​పెక్టేషన్స్​ పెంచగా, తాజాగా వచ్చిన ఈ పోస్టర్ అభిమానుల్లో మరింత ఆసక్తిని రేపుతోంది. ముఖ్యంగా ఇందులో సిద్ధు, అనుపమ కెమిస్ట్రీ ఎలా ఉంటుందో అంటూ ఫ్యాన్స్ ఇంట్రెస్ట్​గా ఎదురుచూస్తున్నారు.

ఇక టిల్లు స్క్వేర్​ విషయానికి వస్తే - ఇందులో సిద్ధు, అనుపమతో పాటు మురళీధర్ గౌడ్‌, ప్రణీత్ రెడ్డి కీలక పాత్రలు పోషిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్ బ్యానర్‌ సంయుక్తంగా తెరకెక్కస్తున్న ఈ సినిమాతో ద్వారా మల్లిక్‌రామ్‌ అనే కొత్త డైరెక్టర్ ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. రామ్‌ మిర్యాలతో పాటు శ్రీచరణ్ పాకాల ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.

Siddu Jonnalagadda Upcoming Movies :మరోవైపు సిద్ధు జొన్నలగడ్డ ఈ సినిమాతో పాటు నీరజ కోన తెరకెక్కించనున్న మరో సినిమాలో కనిపించనున్నారు. 'తెలుసు కదా' అనే టైటిల్​తో రానున్న ఈ మూవీలో యంగ్​ బ్యూటీస్​ రాశీఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్స్​గా నటిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రం షూటింగ్‌ కూడా ప్రారంభమైంది. టైటిల్​ రివీల్​ కోసం రిలీజ్​ చేసిన ఓ వీడియో అభిమానుల్లో ఈ చిత్రంపై మరింత ఆసక్తిని పెంచింది. దీంతో పాటు నందినిరెడ్డి రూపొందించనున్న మరో సినిమాలో సిద్ధు నటించనున్నారు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

'డీజే టిల్లు- స్క్వేర్​' అప్డేట్​ - రాధిక 'యాంథమ్' రిలీజ్​!

Siddu Jonnalagadda New Movie : ఇద్దరు భామలతో 'డీజే టిల్లు' కొత్త సినిమా.. మనసును తాకేలా వీడియో రిలీజ్​

Last Updated : Jan 26, 2024, 12:59 PM IST

ABOUT THE AUTHOR

...view details