Tillu Square Day 4 Collections :బాక్సాఫీస్ దగ్గర జోరు చూపిస్తున్న టిల్లు స్క్వేర్ విడుదలై నాలుగు రోజులైనా అదే ఊపు కొనసాగిస్తోంది. వేసవి సెలవులతో పాటు వీకెండ్ కూడా బాగా కలిసి వచ్చింది. రూ.100 కోట్ల దిశగా దూసుకెళ్తోంది. నాలుగు రోజుల కలెక్షన్స్ అన్ని సెంటర్లలో సినిమాను బ్రేక్ ఈవెన్ స్థాయికి తీసుకువెళ్లింది. మొత్తం నాలుగు రోజుల్లో ఈ సినిమాకు రూ.78కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు మూవీటీమ్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది.
ఈ మూవీ ఓవర్సీస్లో కూడా మంచి వసూళ్లను అందుకుంటోంది. కొత్త సినిమాలు మరో వారం వరకు లేవు. అందులోనూ ఈ సినిమా పాజిటివ్ రెస్పాన్స్, రెండు గంటల నిడివే కాబట్టి ఎక్కువ షోలతో టిల్లు తన జోరును ఇంకొన్ని రోజులు కొనసాగించే అవకాశం ఉంది. ఇదే జోరును కొనసాగిస్తే రెండో వారం ముగిసిపోక ముందే రూ.100 కోట్లు అందుకునే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
సినిమా కథ విషయానికొస్తే సిద్దు జొన్నలగడ్డ డిజే టిల్లుగా మరోసారి తన కామెడీ పంచులతో థియేటర్లలో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్నాడు. ఇక బోల్డ్ బ్యూటీగా సరికొత్త అవతారంలో అనుపమ యువతను థియేటర్లకు బాగా రప్పిస్తోంది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. మొదటి భాగం హీరోయిన్ నేహా శెట్టి ఈ సీక్వెల్లో అతిథి పాత్రలో కనిపించడం హైలైట్‌గా నిలిచింది.
Tillu Square OTT Rights :ఈ సినిమా మొదటి భాగం ఓటీటీ రైట్స్ ఆహా కొనుగోలు చేసింది. అయితే రెండో పార్ట్‌కు వచ్చిన క్రేజ్‌తో టిల్లు స్క్వేర్ రైట్స్ నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. రూ.13 నుంచి రూ. 15 కోట్లతో ఈ సినిమా రైట్స్ కొనుగోలు చేసినట్లు సమాచారం. వచ్చే నెల మొదటి వారంలో ఓటీటీలో ఈ సినిమా విడుదల అయ్యే అవకాశం ఉంది. శాటిలైట్ రైట్స్‌ను స్టార్ మా కొనుగోలు చేసింది. ఇక ఈ రెండో పార్ట్ హిట్ అవ్వడంతో మూడో భాగాన్ని కూడా టిల్లు క్యూబ్ పేరుతో అనౌన్స్ చేశారు మేకర్స్. సూపర్ హీరోగా ఇది రాబోతున్నట్లు చెప్పారు.