తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ఫ్రైడే స్పెషల్ - OTTలోకి ఒక్కరోజే 11 ఆసక్తికర​ సినిమాలు! - This Week OTT Releases - THIS WEEK OTT RELEASES

This Week OTT Releases : ఈ శుక్రవారం(ఏప్రిల్ 12) ఓటీటీ ప్లాట్​ఫామ్స్​లో ఏకంగా 11 ఆసక్తికర సినిమాలు అందుబాటులోకి రానున్నాయి. అవేంటంటే?

ఫ్రైడే స్పెషల్ - OTTలోకి ఒక్కరోజే 11 ఆసక్తికర​ సినిమాలు!
ఫ్రైడే స్పెషల్ - OTTలోకి ఒక్కరోజే 11 ఆసక్తికర​ సినిమాలు!

By ETV Bharat Telugu Team

Published : Apr 12, 2024, 6:36 AM IST

Updated : Apr 12, 2024, 6:56 AM IST

This Week. Friday OTT Releases :ఓటీటీకి పెరుగుతున్న ఆదరణ వల్ల ప్రతి వారం ఈ ప్లాట్​ఫామ్​లోకి సినిమాలు స్ట్రీమింగ్​కు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ శుక్రవారం అంటే ఏప్రిల్ 12న ఏకంగా 11 సినిమాలు ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ వంటి ప్లాట్​ఫామ్స్​లో విడుదల కానున్నాయి. మరి ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమైన ఆ చిత్రాలేంటో చూసేద్దాం.

  • నెట్ ఫ్లిక్స్:
  • లాల్ సలామ్: రజనీకాంత్ కూతురు ఐశ్వర్య డైరెక్ట్ చేసిన లాల్ సలామ్ సినిమాలో విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా చేస్తే ఇందులో రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటించారు.
  • అమర్ సింగ్ చమ్కీలా(హిందీ): అమర్ సింగ్ చమ్కీలా అనే పంజాబీ గాయకుడు జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో అమర్ సింగ్ గా దిల్జిత్ దొసాంజ్ నటిస్తున్నాడు. ఈ సినిమాలో అతనితో పాటు పరిణితి చోప్రా, నిషా బనో, అనురాగ్ అరోరా నటిస్తున్నారు.
  • గుడ్ టైమ్స్ అనే యానిమేటెడ్ సిట్ కామ్ విడుదల కాబోతుంది.
  • లవ్ డివైడెడ్ అనే స్పానిష్ రొమాంటిక్ కామెడీ మూవీ.
  • స్టోలెన్ అనే స్వీడిష్ సినిమా.
  • ఊడి ఉడ్ పెక్కర్ గోస్ టు క్యాంప్ 2024 అనే చిన్న పిల్లల యాక్షన్ యానిమేటెడ్ సిరీస్.
  • ఆమెజాన్ ప్రైమ్:
  • శ్రీ విష్ణు హీరోగా నటించిన కామెడీ ఎంటర్టైనర్ ఓం భీమ్ బుష్ థియేటర్లలో బాగానే సందడి చేసింది. ఇప్పుడు ఓటిటిలో కూడా సందడి చేయడానికి సిద్ధమైంది.
  • ఎన్ డబ్ల్యూ ఎస్ ఎల్ (నేషనల్ విమెన్ సాసర్ లీగ్)అనే ఒరిజినల్ ప్రైమ్ సిరీస్ కూడా రీలీజ్ కాబోతుంది.
  • జీ5:విశ్వక్ సేన్ నటించిన గామి సినిమా కూడా ఈ శుక్రవారం జీ5లో విడుదల కానుంది.
  • ఆహా: మలయాళంలో సూపర్ హిట్ అయిన ప్రేమలు తెలుగు వెర్షన్ ఆహా ఓటిటిలో విడుదల కానుంది.
  • సన్ నెక్స్ట్: లాల్ సలాం నెట్ ఫ్లిక్స్ తో పాటు ఇందులో కూడా విడుదల కానుంది.
  • డిస్ని ప్లస్ హాట్ స్టార్: ప్రేమలు తమిళ, మలయాళ, హిందీ వెర్షన్ ఇందులో విడుదల కానుంది.
  • జియో సినిమా: జియో సినిమాలో హైటౌన్ సీజన్ 3 అనే హాలీవుడ్ సిరీస్ విడుదల కానుంది
Last Updated : Apr 12, 2024, 6:56 AM IST

ABOUT THE AUTHOR

...view details