తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ హిట్​ హారర్ మూవీ - భయపడకుండా చూడగలరా? - హారర్ మూవీ ది ఎగ్జార్సిస్ట్ ఓటీటీ

ఓటీటీ ప్రేక్షకుల్ని భయపెట్టేందుకు మరో సూపర్ హిట్ హారర్ చిత్రం వచ్చేసింది. గతేడాది విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను అందుకున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్​ఫామ్​లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ వివరాలు.

Etv Bharat
Etv Bharat

By ETV Bharat Telugu Team

Published : Feb 7, 2024, 6:51 AM IST

Updated : Feb 7, 2024, 8:24 AM IST

The Exorcist Believer OTT : హాలీవుడ్ సూపర్ హిట్ ఫ్రాంఛైజీ ది ఎగ్జార్సిస్ట్ నుంచి వచ్చిన ఆరో చిత్రం ది ఎగ్జార్సిస్ట్ : బిలీవర్. ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్​ఫామ్​ జియో సినిమాలో ఇది స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో రిలీజైన నాలుగు నెలల తర్వాత ఈ చిత్రం ఇప్పుడు ఇండియన్ ఓటీటీ ప్లాట్‌ఫామ్​లోకి వచ్చింది. ఇంగ్లిష్ తోపాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లోనూ ఈ మూవీ అందుబాటులో ఉంది.

కాగా, తొలిసారి 1973లో ది ఎగ్జార్సిస్ట్ టైటిల్​తో వచ్చిన హారర్​ సినిమా ప్రేక్షకుల్ని బాగానే భయపెట్టింది. ఆ తర్వాత వరుసగా ఈ ఫ్రాంచైజీలో సినిమాలు వచ్చాయి. అలా గతేడాది అక్టోబర్​లో ఆరో సీక్వెల్ ది ఎగ్జార్సిస్ట్ : బిలీవర్ పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి రెస్పాన్స్​ను అందుకుంది. అయితే అంతకుముందు వచ్చిన చిత్రాలతో పోలిస్తే కాస్త డివైడ్ టాక్ కూడా​ వచ్చింది. కానీ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే అందుకుంది. 30 మిలియన్ డాలర్ల బడ్జెట్​తో రూపొందిన ఈ చిత్రం దాదాపు 130 మిలియన్ డాలర్లను వసూలు చేసింది. ఈ ఆరో సీక్వెల్​ డేవిడ్ గోర్డన్ గ్రీన్ దర్శకత్వం వహించగా - లిడియా జెవెట్, లెస్లీ ఒడోమ్ జూనియర్, ఒలీవియా ఓనీల్ నటించారు.

కాగా, 1971లో ది ఎగ్జార్సిస్ట్ పేరుతో నవల ఒకటి ప్రచురితమైంది. అనంతరం 1973లో మొదటిసారి అదే టైటిల్ తో సినిమాగా దీన్ని తెరకెక్కించారు. ఎగ్జార్సిస్ట్ అంటే భూత వైద్యుడు అని అర్థం వస్తుంది. ఇక ఈ ఫ్రాంచైజీ నుంచి 1977లో ఎగ్జార్సిస్ట్ 2 : ది హెరెటిక్, 1990లో ది ఎగ్జార్సిస్ట్ 3, 2004లో ఎగ్జార్సిస్ట్ : ది బిగినింగ్, 2005లో డొమినియన్ : ప్రీక్వెల్ టు ఎగ్జార్సిస్ట్ చిత్రాలు వచ్చి ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. అనంతరం మళ్లీ దాదాపు 18 ఏళ్ల తర్వాత ది ఎగ్జార్సిస్ట్ : బిలీవర్ గతేడాది రిలీజై ఆడియెన్స్​ను అలరించింది.

షాకింగ్​ : విడాకులు తీసుకున్న స్టార్ హీరోయిన్​

బాలీవుడ్​లో కాంట్రవర్సీగా సందీప్ వంగా కామెంట్స్​

Last Updated : Feb 7, 2024, 8:24 AM IST

ABOUT THE AUTHOR

...view details