తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'దేశం ఆయనకు రుణపడి ఉంటుంది'- రతన్ టాటాకు సినీ ప్రముఖుల నివాళులు - RATAN TATA TRIBUTES

Celebrities Tributes Ratan Tata : రతన్‌టాటాకు సినీ ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. ఆయన్ని గుర్తుచేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

Celebrities Tributes Ratan Tata
Celebrities Tributes Ratan Tata (Source: ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Oct 10, 2024, 7:46 AM IST

Celebrities Tributes Ratan Tata :ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్‌ గౌరవ ఛైర్మన్‌ రతన్‌ టాటా లేరనే విషయాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. ముంబయిలోని బ్రీచ్‌ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి ఆయన తుదిశ్వాస విడిచారు. దీంతో తెలుగు ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ సినీ నటులు ఆయనను తలచుకుంటూ నివాళులర్పిస్తున్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని సోషల్‌ మీడియా వేదికగా గుర్తుచేసుకుంటున్నారు.

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి రతన్ టాటా మృతికి సంతాపం ప్రకటించారు. భారతీయులకు ఇది బాధాకరమైన రోజు అని ఆయన అన్నారు. ఇక రతన్ టాటాకు భారతదేశం ఎప్పటికీ రుణపడి ఉంటుందని జూనియర్ ఎన్టీఆర్ ట్విట్టర్​లో పోస్ట్ షేర్ చేశారు.

  • 'భారతీయులకు ఇది బాధాకరమైన రోజు. సేవలో రతన్‌టాటాను మించినవారు లేరు. మనదేశం ఇప్పటి వరకు చూసిన గొప్ప దార్శనికుల్లో ఆయన ఒకరు. మెగా ఐకాన్‌. నిజమైన పారిశ్రామిక వేత్త, పరోపకారి. అసాధారణ మానవుడు. టాటా బ్రాండ్‌లను గ్లోబల్‌ పవర్‌ హౌస్‌గా నిర్మించడమే కాకుండా మనదేశ నిర్మాణంలోనూ అద్భుతంగా కృషి చేశారు. మనం ఒక మంచి మనస్సున్న వ్యక్తిని కోల్పోయాం. భారతీయ పారిశ్రామిక వేత్తలలో ఆయన పెంపొందించిన విలువలు తరాలకు స్ఫూర్తినిస్తాయి, మార్గాన్ని నిర్దేశిస్తాయి. రతన్‌ టాటా ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నా' - చిరంజీవి
  • 'రతన్‌టాటా ఓ లెజెండ్‌. మన హృదయాల్లో ఎప్పటికీ జీవించే ఉంటారు. టాటా ఉత్పత్తులను ఉపయోగించని రోజును ఊహించుకోవడం కష్టం. ఎన్నోతరాలకు స్ఫూర్తి. పంచ భూతాలతో పాటు ఆయన కూడా ఎప్పటికీ మనతోనే ఉంటారు. ఎల్లప్పుడూ ఆయన ఆరాధకుడినే. జైహింద్' - రాజమౌళి
  • 'రతన్‌ టాటాది బంగారంలాంటి హృదయం. భారతదేశం ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటుంది. దూరదృష్టి గల వ్యక్తి. ఎంతోమంది జీవితాలను మార్చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నా' - ఎన్టీఆర్‌
  • 'శ్రీ రతన్ టాటాజీ, ఇండియా మిమ్మల్ని మిస్ అవుతోంది. మీ కరుణ, నాయకత్వం! రెస్ట్ ఇన్ పీస్ సర్'- నాగార్జున అక్కినేని
  • 'నాయకత్వం, దాతృత్వం, నైతికతకు రతన్ టాటా ఓ చిహ్నం! ఆయన వారసత్వం తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుంది. భారతదేశం ఒక దిగ్గజాన్ని కోల్పోయింది' - రానా దగ్గుబాటి
  • 'రతన్ టాటాజీ, మీరు ఎప్పటికీ గుర్తుండిపోతారు. మీరు నిజమైన లెజెండ్, ట్రూ ఐకాన్'- దేవీశ్రీ ప్రసాద్

ABOUT THE AUTHOR

...view details