తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

రిలీజ్​కు సంక్రాంతి సినిమాలు రెడీ! వాటిపై రేవంత్ సర్కార్ నిర్ణయం ఎఫెక్ట్ పడుతుందా? - TG GOVT DECISION ON BENIFIT SHOWS

బెనిఫిట్‌ షోలు, టికెట్‌ ధరల పెంపునకు అనుమతి ఇవ్వబోమన్న తెలంగాణ సర్కార్- ఈ నిర్ణయంతో సంక్రాంతి బరిలో నిలిచిన సినినమాల కలెక్షన్లపై ఎఫెక్ట్!

TG Govt Decision On Benifit Shows
TG Govt Decision On Benifit Shows (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : 11 hours ago

TG Govt Decision On Benifit Shows Of Upcoming Movies : సినిమాల బెనిఫిట్‌ షోలు, టికెట్‌ ధరల పెంపునకు అనుమతి ఇవ్వబోమని తెలంగాణ సర్కారు ప్రకటించిన నేపథ్యంలో సంక్రాంతి సినిమాలపై ఆ ప్రభావం పడే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సంధ్య థియేటర్ ఘటన నేపథ్యంలో ప్రభుత్వం ఈ వ్యాఖ్యలు చేసింది. ఒకవేళ ప్రభుత్వం బెనిఫెట్ షోలు, టికెట్ ధరలు పెంపునకు అనుమతి ఇవ్వకపోతే రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్', బాలయ్య 'డాకూ మహారాజ్', వెంకీ 'సంక్రాంతికి వస్తున్నాం' వంటి సినిమాలు వసూళ్ల పరంగా దెబ్బతినే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

ఆ సినిమాల దెబ్బే!
తెలంగాణలో ఇకపై ఎలాంటి బెనిఫిట్‌ షోలు ఉండవని, సినిమా టికెట్ల ధరలూ పెంచేది లేదని ఇటీవలే తెలంగాణ సినిమాటోగ్రఫీశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి ప్రకటించారు. 'పుష్ప2' ప్రీమియర్‌ సందర్భంగా సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన ఘటన, దాని తదనంతర పరిణామాలు, అసెంబ్లీలో సీఎం రేవంత్‌ రెడ్డి ప్రకటన, అల్లు అర్జున్‌ ప్రెస్‌ మీట్‌ ఇవి ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో హాట్‌ టాపిక్‌గా ఉన్నాయి. టికెట్‌ రేట్లు పెంచేది లేదని తెలంగాణ సర్కారు నిర్ణయం రాబోయే సంక్రాంతి సినిమాల వసూళ్లపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంటున్నారు.

'పుష్ప2'కు టికెట్ ధరలు పెంపు
సుకుమార్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన చిత్రం 'పుష్ప2: ది రూల్‌'. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించిన ఈ మూవీ డిసెంబరు 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమాకు ఇప్పటివరకూ ఏ ప్రభుత్వమూ ఇవ్వని విధంగా తెలంగాణ సర్కారు టికెట్‌ ధరలు పెంచుకునేందుకు అవకాశం ఇచ్చింది. అంతేకాదు, విడుదలకు ముందు రోజు అంటే డిసెంబరు 4న పెయిడ్‌ ప్రీమియర్‌ షోలకూ అనుమతి ఇచ్చింది.

భారీగా టికెట్ల ధర పెంపు
ప్రీమియర్ షోకు టికెట్‌ ధరకు అదనంగా రూ.800 పెంచుకునేలా అనుమతినిచ్చింది. దీంతో సాధారణ థియేటర్‌లో టికెట్‌ ధర రూ.1000 దాటిపోగా, మల్టీప్లెక్స్‌లలో పన్నులతో కలిపి రూ.1200లకు పైనే అయింది. అలాగే, విడుదలైన రోజు నుంచి నాలుగు రోజులు ఒక్కో టికెట్‌ ధర దాదాపు రూ.500 వరకూ ఉంది. దీంతో 'పుష్ప2' భారీగా వసూళ్లు సాధించింది. తొలి రోజు అత్యధికంగా రూ.294 కోట్లు వసూలు చేసి చరిత్రకెక్కింది. ఇప్పుడు ఏకంగా రూ.1500 కోట్లకు పైగా వసూళ్లతో బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది.

అల్లు అర్జున్ అరెస్టు- పూర్తిగా మారిపోయిన సీన్
మరోవైపు సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగానే అల్లు అర్జున్‌ ను అరెస్ట్‌ చేశారు. ఆ తర్వాత ఆయన బెయిల్‌పై బయటకు వచ్చారు. ఈ ఘటనపై ప్రతి పక్షాలు ప్రభుత్వంపై విమర్శలు చేయటం, అల్లు అర్జున్‌ను పరామర్శించేందుకు ఆయన ఇంటికి సినీతారలు క్యూ కట్టడం వంటి ఘటనలపైనా సామాజిక మాధ్యమాల వేదికగా తీవ్ర చర్చ జరిగింది. అలాగే తెలుగు రాష్ట్రాలుూ సహా దేశవ్యాప్తంగా ఈ ఘటనలు హాట్ టాపిక్ గా మారాయి.

సీఎం స్పందన
ఈ క్రమంలోనే అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి సంధ్య థియేటర్‌ ఘటన, తదనంతర పరిణామాలపై సమాధానం ఇచ్చారు. థియేటర్ వద్ద జరిగిన విషాదకర ఘటన విషయంలో అల్లు అర్జున్‌ సహా, సినీ ప్రముఖులు కనీసం మానవీయ కోణంలోనూ స్పందించలేదని వ్యాఖ్యానించారు. సామాన్యుల ప్రాణాలు పోతున్నా సరే ప్రత్యేక సదుపాయాలు కల్పించాలంటే మాత్రం కుదరదని తెలిపారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఈ విషయాన్నే స్పష్టం చేశారు. దీంతో రాబోయే సంక్రాంతి సినిమాలపై ప్రభుత్వ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపనున్నట్లు తెలుస్తోంది.

సంక్రాంతి బరిలో మూడు బడా సినిమాలు
రాబోయే సంక్రాంతి కానుకగా మొదటగా ప్రేక్షకులను పలకరించే చిత్రం రామ్ చరణ్-దర్శకుడు శంకర్ కాంబినేషల్ లో తెరకెక్కిన 'గేమ్‌ ఛేంజర్‌'. రూ.450కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. పుష్ప2కు ఇచ్చినట్లే స్పెషల్‌ ప్రీమియర్‌కు అనుమతి లభిస్తుందని, టికెట్ ధరల పెంపుతో పాటు, బెనిఫిట్‌ షోలకు అనుమతి వస్తుందని చిత్ర బృందం అందుకు తగిన ఏర్పాట్లకు సిద్ధమవుతోంది. పుష్ప2 ను దాటేలా వసూళ్లు రాబట్టే అవకాశం ఉందని అంచనాలు కూడా వేశారు.

సర్కార్ నిర్ణయంతో గందరగోళ పరిస్థితి!
అయితే, ఇప్పుడు తెలంగాణ సర్కారు ప్రకటనతో గేమ్‌ ఛేంజర్‌ వసూళ్లు తారుమారయ్యే పరిస్థితి ఏర్పడింది. బెనిఫిట్‌ షోల సంగతి పక్కన పెడితే, టికెట్‌ ధరల పెంపునకు అనుమతి ఇవ్వబోమని ప్రభుత్వం చెప్పడం ఒకరకంగా షాక్‌ తగిలినట్లే. మరోవైపు, అటు సీఎం ప్రకటన, ఇటు అల్లు అర్జున్‌ ప్రెస్‌ మీట్‌తో ఈ అంశం మరింత హీటెక్కింది. ఈ పరిస్థితుల్లో టికెట్‌ ధరల పెంపునకు అనుమతి ఇచ్చే అవకాశం లేనట్లే.

సంక్రాంతి బరిలో బాలయ్య
అలాగే సంక్రాంతి బరిలో నిలిచిన మూవీ 'డాకూ మహారాజ్'. నందమూరి నటసింహం బాలకృష్ణ కథానాయకుడిగా బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. ఈ మూవీ టికెట్‌ ధరల పెంపునకు కూడా అవకాశం ఉంటుందని భావించారు. తాజా నిర్ణయంతో వసూళ్లు ఆశించిన స్థాయిలో వచ్చే అవకాశం లేదంటున్నారు.

బాలయ్య గత చిత్రం 'భగవంత్‌ కేసరి' ఫుల్‌ రన్‌లో దాదాపు రూ.130 కోట్లు వసూలు చేసింది. అప్పుడు టికెట్‌ ధరల పెంపు, బెనిఫిట్‌ షోలు ఉన్నాయి. ఇప్పుడు అవేవీ లేకుండా ఆ మార్కును అందుకోవడం కష్టంగా కనిపిస్తోంది. వీటితో పాటు వస్తున్న మరో మీడియం బడ్జెట్‌ మూవీ 'సంక్రాంతికి వస్తున్నాం'. ఇది మాస్‌ మూవీ కాదు. పక్కా కుటుంబ ప్రేక్షకులే లక్ష్యంగా దీన్ని తీర్చిదిద్దుతున్నారు. విక్టరీ వెంకటేశ్‌ హీరోగా అనిల్‌ రావిపూడి డైరెక్షన్ లో ఈ మూవీ రాబోతోంది. ప్రీమియర్‌, బెనిఫిట్‌ షోలు లేకపోయినా, టికెట్‌ ధరలు పెంచుకునే వెసులుబాటు ఉంటుందని భావించారు. ఈ మూవీకి కూడా దిల్‌రాజు నిర్మాత కావడం గమనార్హం. ప్రభుత్వం నిర్ణయంతో దీనిపై ప్రభావం పడే అవకాశం ఉంది.

ఏపీ సర్కార్ ఏం చేస్తుందో?
ఇండస్ట్రీ లెక్కలు తారుమారు చేయనున్న ప్రభుత్వం నిర్ణయంపై సినీ పెద్దలు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. మరోవైపు, తెలంగాణ సర్కారు బాటలోనే ఏపీ ప్రభుత్వం నడుస్తుందా? సంక్రాంతి సినిమాలపై అక్కడి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే, 'పుష్ప 2' టికెట్‌ ధరల విషయంలో చివరి వరకూ ఏపీలో సస్పెన్స్‌ కొనసాగింది,

'నిజంగా సారీ, అలా చెప్పినందుకు' - విజయ్​, మహేశ్ సినిమాపై రష్మిక కామెంట్స్!

బాలీవుడ్‌ అడ్డాలో 'పుష్ప 2' సరికొత్త రికార్డ్ - 100 ఏళ్ల చరిత్రలో తొలిసారి ఇలా!

ABOUT THE AUTHOR

...view details