తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

సుహాస్ కోసం రంగంలోకి సుకుమార్​ - మ్యాటర్ ఏంటంటే? - Suhas Prasanna vadanam - SUHAS PRASANNA VADANAM

Sukumar Suhas Prasanna Vadanam : సుహాస్ కోసం పుష్ప డైరెక్టర్​ సుకుమార్​ రంగంలోకి దిగారు. ఎందుకంటే?

z
z

By ETV Bharat Telugu Team

Published : Apr 26, 2024, 5:04 PM IST

Updated : Apr 26, 2024, 6:09 PM IST

Sukumar Suhas Prasanna Vadanam :ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న యంగ్ హీరోల్లో సుహాస్‌ కూడా ఒకరిగా మారారు. కలర్ ఫొటోతో కథానాయకుడిగా మారిన ఆయన ప్రస్తుతం ప్రామిసింగ్ హీరోగా మంచి పేరు తెచ్చుకుంటున్నారు. తాను చేసే సినిమా కథలో వైవిధ్యం చూపిస్తూ ఆడియెన్స్‌ను అలరించేందుకు ప్రయత్నిస్తున్నారు. రీసెంట్​గానే అంబాజీపేట మ్యారేజి బ్యాండుతో బాక్సాఫీస్ ముందు సూపర్ హిట్ టాక్​ను అందుకున్నారు. ఇప్పుడు ఆయన క్రేజ్ ప్రస్తుతం ఎంతలా పెరిగిపోయిందంటే టాప్ బ్యానర్లు, టాప్ డైరెక్టర్లు కూడా ముందుకొచ్చి ఆయన సినిమాను ప్రమోట్‌ చేస్తున్నారు.

ప్రస్తుతం సుహాస్​ ప్రసన్నవదనం అనే చిత్రంతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మూవీ మే 3న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా నేడు హైదరాబాద్‌లోని దసపల్లా కన్వెక్షన్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్​ను ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్​కు పుష్ప డైరెక్టర్ సుకుమార్ చీఫ్ గెస్ట్​గా రానుండటం విశేషం. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సుకుమార్ వస్తున్నారనే వార్త బయటకు రావడంతో ఈ సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన బజ్ పెరిగిపోయింది.

ఇకపోతే సుహాస్​ నటించిన ప్రసన్నవదనం సినిమాను సలార్‌ ప్రాంఛైజీ బ్యానర్​ హోంబలే ఫిలిమ్స్‌ కర్ణాటక ప్రాంత పంపిణీ హక్కులను కొనుగోలు చేయడం కూడా హాట్​ టాపిక్​గా మారింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్లు పంపిణీ చేస్తున్నారు. మొత్తంగా ఇలా టాప్ బ్యానర్లు ముందుకొచ్చి తన సినిమాలు కొనే స్థాయికి సుహాస్ ఎదగడం చాలా గ్రేట్ అంటూ సినీ ప్రియులు కామెంట్లు పెడుతున్నారు.

కాగా, ఈ చిత్రాన్ని అర్జున్ వైకే డైరెక్ట్ చేశారు. సినిమాలో విజయ్ బల్గానిన్‌ కీలక పాత్ర పోషించారు. పాయల్ రాధాకృష్ణ, నితిన్‌ ప్రసన్న, వైవా హర్ష, రాశీ సింగ్‌, సాయి శ్వేత, నందు ఇతర కీలక పాత్రల్లో నటించారు. మణికంఠ, ప్రసాద్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సుహాస్ చేతిలో అనందరావు అడ్వెంచర్స్, కేబుల్ రెడ్డి సినిమాలు ఉన్నాయి. ఇవి ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్నాయి. త్వరలోనే రిలీజ్ కానున్నాయి.

విశాల్ యాక్షన్ డ్రామా 'రత్నం' ఎలా ఉందంటే? - Ratnam Movie review

ఇండస్ట్రీలోకి అబ్బాయిగా ఎంట్రీ - ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు స్టార్​ హీరోయిన్​గా ఇమేజ్​! - AHSAAS CHANNA

Last Updated : Apr 26, 2024, 6:09 PM IST

ABOUT THE AUTHOR

...view details