తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ఏకంగా 200 సినిమాలకు నో - హీరో అవ్వాల్సినోడు సీరియల్స్​ చేస్తున్నాడు! - Actor Rejected 200 Films

ఇండస్ట్రీలోని ఓ ప్రముఖ యాక్టర్​ ఏకంగా 200 సినిమాలను రిజెక్ట్ చేశారట. ఆ రిజెక్ట్ చేసిన కథల్లో కొన్ని సెలెక్ట్ చేసుకుని షారుక్, ఆమిర్ లాంటి హీరోలు స్టార్ డమ్​ను అందుకున్నారని తెలిసింది. పూర్తి వివారలు స్టోరీలో.

Star Hero Rejected 200 Films
Star Hero Rejected 200 Films (Source: Etv Bharat)

By ETV Bharat Telugu Team

Published : May 17, 2024, 4:06 PM IST

Sudesh berry Rejected 200 Films : సినీ ఇండస్ట్రీలో టాలెంట్​తో పాట అదృష్టం కచ్చితంగా ఉండాల్సిందే. ఎందుకంటే అది లేక చాలా మంది తెర‌మ‌రుగైన న‌టులు ఉన్నారు. అలాంటి వారిలో ఆయన కూడా ఒక‌రు. ఈయన పలు కారణాలతో దాదాపు 200 సినిమాలకు వరకు రిజెక్ట్ చేశారట. అలా ఈయన రిజెక్ట్ చేసిన చాలా చిత్రాలను షారుక్ ఖాన్, ఆమిర్​ ఖాన్ వంటి హీరోలు చేసి స్టార్ స్టేటస్​, బ్లాక్ బస్టర్​ హిట్​లను అందుకున్నారు. ఆయన మరెవరో కాదు బాలీవుడ్ ప్రముఖ న‌టుడు సుదేశ్ బెర్రీ. బోర్డ‌ర్‌, ఎల్‌వోసీ, బోర్డ‌ర్ హిందుస్థాన్ కా వంటి చిత్రాలతో మంచి పేరు సంపాదించుకున్నారాయన.

సుదేశ్​ బెర్రీ 1980-90 కాలంలో పలు హిట్ చిత్రాల్లో నటించారు. 1988లో వచ్చిన ఖ‌త్రోంకి ఖిలాడి సినిమాతో ఆయన కెరీర్ మొదలైంది. గాయ‌ల్ చిత్రం మొదట ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత భిన్నమైన పాత్ర‌ల‌తో విల‌క్ష‌ణ న‌టుడిగా పేరు సంపాదించుకున్నారు.

200 సినిమాలు రిజెక్ట్‌ - గాయల్​ చిత్రం తర్వాత త‌న న‌ట‌న‌తో దర్శకనిర్మాతలు, ఆడియెన్స్​ ఆకట్టుకున్న సుదేశ్​ బెర్రీ మొదటి నుంచి స్క్రిప్ట్ సెలక్షన్స్​లో సెలక్టివ్​గా ఉండేవారట. అందుకే చాలా వరకు కథలు, క్యారెక్టర్స్​ నచ్చక చాలా సినిమాలను వదులుకున్నారట. మొత్తంగా తన కెరీర్​లో 200కుపైగా సినిమాలను వదులుకున్నట్లు స్వయంగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు సుదేశ్​. సుదేశ్ రిజెక్ట్ చేసిన చిత్రాలతోనే షారుక్​ ఖాన్‌, అమీర్‌ ఖాన్‌, అజ‌య్ దేవ్‌గ‌ణ్ వంటి హీరోలు స్టార్‌డ‌మ్‌ను సంపాదించుకున్నారని బయటు ఇంగ్లీష్ కథనాల్లో కూడా రాసి ఉంది. డ‌ర్ చిత్రంలో మొదట సుదేశ్​ బెర్రీనే హీరోగా తీసుకున్నారట డైరెక్ట‌ర్ య‌శ్ చోప్రా. స్క్రీన్ టెస్ట్ కూడా చేశారట. కానీ నెగెటివ్ షేడ్స్‌ క్యారెక్టర్ కావడంతో సుదేశ్ బెర్రీ ఆ పాత్రను రిజెక్ట్ చేశారట. ఆ తర్వాత షారుక్​ ఖాన్​ చేసిన ఈ మూవీ ఇండ‌స్ట్రీ హిట్‌గా నిలిచింది. షారుక్​కు మంచి పేరు తీసుకొచ్చింది. ఇలాంటి చాలా సందర్భాలే ఉన్నాయట.

కొంతకాలంగా సిల్వర్​ స్క్రీన్​కు దూరం - బోర్డ‌ర్‌, ఎల్‌వోసీ, బోర్డ‌ర్ హిందుస్థాన్ కా వంటి చిత్రాలతో మంచి పేరు సంపాదించుకున్న సుదేశ్​ కొంతకాలంగా వెండితెరకు దూరంగా ఉంటున్నారు. చివరిగా 2021లో విడుదలైన రాజ్‌నందిని సినిమాతో ఆడియెన్స్​ను అలరించారాయన. అలానే కొత్త త‌రం న‌టుల రావడంతో పోటీ కూడా పెరిగి సుదేశ్​కు సినిమా అవ‌కాశాలు తగ్గిపోయాయి.

30కుపైగా సీరియల్స్​లో - అయితే ఓ వైపు సినిమాల్లో న‌టిస్తూనే మరోవైపు సీరియ‌ల్స్​లోనూ నటించారు సుదేశ్. మ‌హాభార‌త్ ధారావాహికలో విచిత్ర‌వీర్య పాత్ర పోషించారు. ఈ పాత్ర ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. అలా దాదపు ముప్పైకి పైగా సీరియ‌ల్స్‌లో నటించారాయన. ప్ర‌స్తుతం పూర్ణిమ సీరియ‌ల్‌లో నటిస్తున్నారు.

రూ. 30 కోట్ల టికెట్లు సోల్డ్ - 40 ఏళ్ల క్రితమే చైనాలో రికార్డు - సినిమా, సాంగ్స్ అన్నీ సూపర్ హిట్టే - Bollywood Movie in China

ABOUT THE AUTHOR

...view details