తెలంగాణ

telangana

ఆగని 'స్ట్రీ 2' కలెక్షన్ల జోరు - ఒక్క సాంగ్​ కోసం తమన్నా ఎంత వసూలు చేసిందంటే? - Stree 2 Tamannaah remuneration

By ETV Bharat Telugu Team

Published : Aug 21, 2024, 9:04 AM IST

Stree 2 Movie Box Office Collections : ప్రస్తుతం బాలీవుడ్​ బాక్సాఫీస్ ముందు స్త్రీ 2 సినిమా దూసుకుపోతోంది. అయితే ఈ సినిమాలో స్పెషల్​ సాంగ్​లో చిందులేసిన తమన్నా గట్టిగానే రెమ్యునరేషన్ తీసుకుందట. పూర్తి వివరాలు స్టోరీలో.

source ANI
Tamannaah Stree 2 Movie Box Office Collections (source ANI)

Stree 2 Movie Box Office Collections : ప్రస్తుతం బాలీవుడ్​లో 'స్త్రీ 2' సినిమా సూపర్​ రెస్పాన్స్​తో దూసుకెళ్తోన్న సంగతి తెలిసిందే. తొలి రోజు నుంచే హిట్ టాక్​ అందుకుని హిందీ బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. 'స్త్రీ 2' విడుదలైన(ఆగస్టు 15) రోజునే 'ఖేల్‌ ఖేల్‌ మే', 'వేదా' చిత్రాలు కూడా విడుదలయ్యాయి. కానీ ఆ రెండు చిత్రాల కలెక్షన్లను స్త్రీ 2 బీట్ చేస్తూ సక్సెస్‌ఫుల్‌గా థియేటర్లలో రన్‌ అవుతోంది. ఈ చిత్రం ఐదు రోజుల్లోనే రూ.228 కోట్లకుపైగా వసూళ్లను అందుకోగా 6వ రోజు(ఆగస్ట్ 20) పూర్తయ్యేసరికి రూ.250కోట్ల క్లబ్​లోకి అడుగుపెట్టినట్లు తెలిసింది.

ఈ సినిమా ప్రీమియర్స్​ ద్వారా రూ.8.5కోట్లు, తొలి రోజు 51.8 కోట్లు, రెండో రోజు రూ. 31.4 కోట్లు, మూడో రోజు రూ. 43.85 కోట్లు, నాలుగో రోజు రూ.55.9 కోట్లు, ఐదో రోజు రూ. 38.1 కోట్లు, ఆరో రోజు రూ. 25 కోట్లు, మొత్తంగా ఇండియాలో రూ.254.55 కోట్లు కలెక్ట్ చేసిందట.

Stree 2 Movie Tamannaah Remuneration : ఇకపోతే ఈ సినిమాలో శ్రద్ధా కపూర్‌, రాజ్‌కుమార్‌ రావుతో పాటు తమన్నా స్పెషల్ సాంగ్​లో చిందులేసింది. సినిమాలో 'ఆజ్ కీ రాత్' అంటూ అభిమానులను ఉర్రూతలూగించింది. అయితే ఈ ప్రత్యేక గీతం చేసినందుకు తమన్నా భారీ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకున్నట్లుగా బీటౌన్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆమె ఏకంగా రూ.కోటీ రూపాయలు ఛార్జ్ చేసినట్లు సమాచారం. దీంతో, స్క్రీన్‌పై తమన్నా 5 నిమిషాలు కనిపించినందుకు ఇంత మొత్తంలో తీసుకుందా అని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.

కాగా, 2018లో రిలీజైన స్త్రీ సినిమాకు సీక్వెల్‌గా స్త్రీ 2ను తెరకెక్కించారు. మ్యాడోక్‌ ఫిల్మ్‌ సంస్థ, జియో స్టూడియోస్ కలిసి సినిమాను ప్రొడ్యూస్​ చేశారు. చిత్రంలో స్టార్ హీరోలు అక్షయ్‌ కుమార్, వరుణ్‌ ధావన్‌, అపర్ శక్తి, పంకజ్‌ త్రిపాఠి కూడా కీలక పాత్రల్లో కనిపించి ఆకట్టుకున్నారు. ముఖ్యంగా సినిమాలోని సీరియస్ సీన్స్​ను కూడా కామెడీ ట్రాక్​లో చూపించడం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది.

'ఈ ప్రపంచం ఓ వేదిక' - అంచనాలు పెంచుతున్న 'జోకర్​' సీక్వెల్​ లేటెస్ట్ అప్డేట్​! - Joker Movie Sequel

సినిమాలు నిల్, క్రేజ్ ఫుల్ - ఆ ఒక్కటి ఈ అందాల తారల జీవితాన్నే మార్చేసింది! - Heroines As SocialMedia Influencers

ABOUT THE AUTHOR

...view details