Siddhu Jonnalagadda Anupama Parameshwaran DJ Tillu Square Collections : సిద్ధు జొన్నలగడ్డ - అనుపమ పరమేశ్వరన్ నటించిన టిల్లు స్క్వేర్ రెస్పాన్స్ అస్సలు తగ్గట్లేదు. వీకెండ్లో అదిరిపోయే వసూళ్లు సాధించింది. దీంతో హాఫ్ సెంచరీ దాటేశాడు టిల్లు స్క్వేర్. ప్రస్తుతం సెంచరీ దిశగా దూసుకెళ్తున్నాడు.
తొలి రోజే రూ. 23 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించిన ఈ చిత్రం డే 2 కూడా అంతకుమించి కలెక్షన్లను అందుకుంది. సినిమాకు పెట్టిన బడ్జెట్ మించి వసూలు చేసి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. రెండు రోజుల్లో రూ.45.3 కోట్ల గ్రాస్ అందుకుంది. ఇక ఆదివారం సెలవ రోజు కావడం వల్ల మరింత భారీ వసూళ్లు వచ్చాయి. మూడు రోజుల్లోరూ. 68.1 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు మూవీటీమ్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది.
ఇకపోతే స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ ఈ టిల్లు స్క్వేర్ సినిమాలో హీరోగా నటించిన సంగతి తెలిసిందే. తన బాడీ లాంగ్వేజ్‌తో మరోసారి ప్రేక్షకులను బాగా నవ్వించాడు. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. ఇంతకాలం డీసెంట్ పాత్రలతో ఆడియెన్స్ మెప్పించే అనుపమ పరమేశ్వరన్ ఈ మధ్య బోల్డ్ డోస్ పెంచుతోంది. అలా ఈ టిల్లు స్క్వేర్‌లో లిప్ లాక్, రొమాంటిక్ సన్నివేశాల్లో రెచ్చిపోయి మరీ నటించింది. ఈ జోడీ కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకున్నప్పటికీ అనుపమపై మాత్రం తీవ్రంగా నెగటివ్ టాక్ వస్తోంది.