తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

సిద్ధార్థ్, అదితిరావ్ నెట్​వర్త్​ ఎన్ని కోట్లో తెలుసా? - ఈ జంట ఒక్కో సినిమాకు ఎంత తీసుకుంటారంటే? - Siddharth Aditi Rao hydari NetWorth - SIDDHARTH ADITI RAO HYDARI NETWORTH

Aditi Rao Hydari Siddharth Net Worth : హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితిరావు హైదరీ తాజాగా వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. పెళ్లి తంతును చాలా సింపుల్​గా పూర్తి చేసుకన్న ఈ కొత్త జంట నెట్ వర్త్ ఎంత ఉంటుందో తెలుసా?, ఒక్కో సినిమాకు వీరు ఎంత వసూలు చేస్తారో తెలుసా? దాని గురించే ఈ కథనం.

source IANS
Aditi Rao Hydari Siddharth Marriage (source IANS)

By ETV Bharat Telugu Team

Published : Sep 16, 2024, 6:46 PM IST

Aditi Rao Hydari Siddharth Net Worth : ప్రముఖ హీరోహీరోయిన్​ సిద్ధార్థ్ , అదితిరావు హైదరీ తాజాగా వివాహా బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. గత కొద్ది రోజులుగా ప్రేమాయణం సాగించిన వీరిద్దరూ ఇరు కుటుంబాల అంగీకారంతో వనపర్తి దేవాలయంలో అధికారికంగా పెళ్లి చేసుకున్నారు. వీటికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా ద్వారా తమ అభిమానులతో పంచుకున్నారు అదితి. ముచ్చటైన ఈ జంట పెళ్లి ఫొటోలను చూసి అటు ఫ్యాన్స్, ఇటు సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Aditi Rao Hydari Siddharth Marriage :అయితే అదితి రావ్ హైదరీ, సిద్ధార్థ్ పెళ్లి ఇంత సింపుల్​గా జరుపుకోవడం ఏంటని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. ఇద్దరూ మంచి గుర్తింపు పొందిన నటులే అయినప్పటికీ ఓ దేవాలయంలో ఇంత సింపుల్​గా వివాహం జరుపుకోవడం వెనక కారణమేంటా అని ఆరా తీస్తున్నారు. ఇందుకు కారణం 400ఏళ్ల చరిత్ర ఉన్న ఈ గుడి అదితి కుటుంబానికి చాలా ముఖ్యమైనదట. ఈమె తెలంగాణలోని వనపర్తి సంస్థానానికి చెందిన వారసురాలు. అందుకే ఈమె పెళ్లి వేడుక అక్కడే జరిపించాలని వారు భావించారట.

అదితి, సిద్ధార్థ్ నెట్​వర్త్​ -అదితి తల్లిదండ్రులది హైదరాబాద్​కు చెందిన రాజ వంశీకుల కుటుంబం. ప్రస్తుతం ఈమె నెట్ వర్త్ దాదాపు రూ.60కోట్ల నుంచి 65కోట్ల వరకు ఉంటుందని ఓ ఇంగ్లీష్ మీడియా సంస్థ తెలిపింది. జాగరణ్ ఇంగ్లీష్ రిపోర్ట్ ప్రకారం నటనతో పాటు గాయకుడు, నిర్మాత, స్క్రీన్ వ్రైటర్​గా రాణిస్తున్నసిద్ధార్థ్ నెట్ వర్త్ కూడా దాదాపు రూ.70కోట్లు ఉంటుందట. అంటే ఈ ఇద్దరికీ కలిపి నెట్ వర్త్ సుమారు రూ.130కోట్ల నుంచి రూ.135కోట్లకు మధ్య ఉంటుందని సమాచారం.

ముంబయిలో అపార్ట్మెంట్ -ముంబయిలోని వర్సోవాలో అదితికి ఓ అపార్ట్ మెంటు కూడా ఉందట. బొహెమైన్ థీమ్​లో నిర్మించిన ఈ భవనం అటు మోడ్రన్​గా ఇటు సంప్రదాయకంగా కనిపిస్తుంది. ఉడెన్ ఫర్నీచర్​తో పాటు రకరకాల కళాకృతులు, మొక్కలతో ఆకర్షనీయంగా ఉంటుంది. గత కొద్ది రోజులుగా అంటే మార్చి 2024న సిద్ధార్థ్ అదితీ నిశ్చితార్థం జరిగినప్పటి నుంచి వీరిద్దరూ ఎక్కువ సమయం ఈ అపార్టులోనే గడుపుతున్నారట.

ఒక్కో సినిమాకు ఎంత వసూలు చేస్తారంటే? -చివరిగా సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన హీరామండి : ది డైమండ్ బజార్​లో కనిపించింది అదితి రావు హైదరీ. ఈ వెబ్ సిరిసీ కోసం రూ.కోటి నుంచి రూ.1.5కోట్ల వరకు తీసుకున్నట్లు తెలుస్తోంది. దీని తర్వాత ఈ ముద్దుగుమ్మ విజయ్ సేతుపతితో కలిసి గాంధీ టాక్స్​లో కనిపించనుంది.

మరోవైపు సిద్ధార్థ్ ఒక్కో సినిమాకు రూ.4 కోట్ల వరకూ పారితోషికం తీసుకుంటారని తెలుస్తోంది. టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకారం ఇండియన్-2లో కమల్ హాసన్​తో కలిసి నటించినందుకుగానూ ఈ హీరో రూ.4కోట్ల పారితోషికం తీసుకున్నారట. తర్వాత ఇండియన్-3లోనూ సిద్ధార్థ్ కనిపించనున్నారట.

ఒక్కటైన సిద్ధార్థ్‌, అదితి - పెళ్లి ఫొటోలు వైరల్‌ - Siddharth Aditi Rao Hydari Marriage

'ఆ మూడు రోజులు నీళ్లు మాత్రమే తాగి' - మత్తు వదలరా 2 సత్య గురించి ఆసక్తికర విషయాలు - Mathu Vadalara 2 Comedian Satya

ABOUT THE AUTHOR

...view details