తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

రామాయణంపై మరో పాన్ ఇండియా మూవీ - ఈసారి ఎవరికీ తెలియని కథతో - రామాయణం కొత్త సినిమా

Shree Ram Jai Hanuman First Look : ఇప్పటివరకు రామాయణం గురించి ఎవరూ చెప్పని ఓ కథతో సినిమాను తెరకెక్కించబోతున్నట్లు ఓ కొత్త సినిమా పోస్టర్ రిలీజైంది. 'శ్రీ రామ్, జై హనుమాన్' పేరుతో ఈ మూవీ రాబోతున్నట్లు తెలిపారు మేకర్స్. ఓ స్పెషల్​ పోస్టర్​ను కూడా రిలీజ్ చేశారు.

Eరామాయణంపై మరో పాన్ ఇండియా మూవీ - ఈసారి ఎవరికీ తెలియని కథతో
రామాయణంపై మరో పాన్ ఇండియా మూవీ - ఈసారి ఎవరికీ తెలియని కథతో

By ETV Bharat Telugu Team

Published : Jan 22, 2024, 3:44 PM IST

Updated : Jan 22, 2024, 4:07 PM IST

Shree Ram Jai Hanuman First Look : ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా అయోధ్య పేరే వినిపిస్తోంది. అయితే ఇప్పటికే సినీ ఇండస్ట్రీలో రామాయణం ఆధారంగా ఎన్నో సినిమాలు తెరకెక్కాయి. ఇప్పుడు మరో సినిమా సిల్వర్ ​స్క్రీన్​పై సందడి చేసేందుకు రెడీ అయింది. తాజాగా అయోధ్యలో బాల రాముని ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవాన్ని పురస్కరించుకుని 'శ్రీ రామ్, జై హనుమాన్' అనే మూవీ పోస్టర్‌ రిలీజ్ అయింది.

సురేశ్ ఆర్ట్స్ బ్యానర్​ ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కించనుంది. ఒరిజినల్‌గా ఈ చిత్రాన్ని కన్నడ భాషలో తెరకెక్కించనున్నారు. దీంతో పాటే హిందీ, తమిళ, తెలుగు, మలయాళ, ఇంగ్లీష్ భాషల్లోనూ రిలీజ్ చేయనున్నారు.

ఎవరికీ తెలియని కథతో : రామాయణంలో చాలామందికి తెలియని కొత్త విషయాలను చెబుతూ ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని మేకర్స్ చెబుతున్నారు. 'రామాయణ ఇతిహాసం గురించి ఎవరికీ తెలియని కథతో' అనే అర్థం వచ్చేలా ట్యాగ్ లైన్​ ఇచ్చారు. అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ జరిగిన ముహుర్తానికే ఈ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. దీంతో ఈ మూవీలో ఏం చూపిస్తారనే విషయంపై ప్రేక్షకుల్లో ఆసక్తి మొదలైంది.

నటీనటులపై నో క్లారిటీ : 'శ్రీ రామ్, జై హనుమాన్' నుంచి రిలీజైన పోస్టర్‌లో రాముడు, హనుమంతుడు కనిపిస్తున్నారు. ఈ మూవీని అవధూత్ డైరెక్ట్ చేస్తున్నారు. అలానే ఈ ఇతిహాస కథలో యాక్షన్ కూడా ఉంటుందని మేకర్స్ పోస్టర్స్​ ద్వారా స్పష్టం చేశారు. సురేశ్ ఆర్ట్స్ బ్యానర్‌పై కేఏ సురేశ్ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు. ఇప్పటికే కన్నడలో ఆయన పలు సూపర్ హిట్ చిత్రాలను నిర్మించారు. ఇప్పుడు 'శ్రీ రామ్, జై హనుమాన్' ప్రాజెక్ట్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమాలో నటిస్తున్న నటీనటులు ఎవరు అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కిస్తున్న నేపథ్యంలో అన్ని భాషల నుంచి నటీనటులను తీసుకునే అవకాశముందని సమాచారం.

'జై హనుమాన్‌'లో ఆంజనేయుడిగా స్టార్‌ హీరో : ప్రశాంత్‌ వర్మ

సెకండ్ వీక్​లోనూ 'హనుమాన్' క్రేజ్- రూ.200 కోట్లు వసూల్​- తొలి సినిమాగా రికార్డ్

Last Updated : Jan 22, 2024, 4:07 PM IST

ABOUT THE AUTHOR

...view details