Shankar About Indian 2 Result :కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ ప్రస్తుతం 'గేమ్ ఛేంజర్' రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగా ఆయన పలు ఇంటర్వ్యూల్లో పాల్గొని సినిమా గురించి కీలక విషయాలు చెప్పుకొస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొని సినిమా విశేషాలు పంచుకున్నారు. ఇందులోభాగంగా తన గత చిత్రం 'ఇండియన్ 2' రిజల్ట్ గురించి ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సినిమా ఫలితాన్ని తాను ఊహించలేదని పేర్కొన్నారు.
"ఇండియన్ 2' సినిమాకు ఇలా నెగిటివ్ రివ్యూలు వస్తాయని నేను అసలు అనుకోలేదు. కానీ, ఫర్వాలేదు. ఇప్పుడు రానున్న'గేమ్ ఛేంజర్', 'ఇండియన్ 3' సినిమాలతో నేను ఎక్స్ట్రార్డినరీ వర్క్‌ను మూవీ లవర్స్‌కు అందించనున్నాను. దీన్ని చూసి ప్రేక్షకులు తప్పకుండా ఎంటర్‌టైన్ అవుతారని భావిస్తున్నాను. సోషియో పొలిటికల్ యాక్షన్ ఫిల్మ్‌గా 'గేమ్ ఛేంజర్' రూపొందింది. ఓ ప్రభుత్వ అధికారికి, పొలిటికల్ లీడర్‌కి మధ్య జరిగే యుద్ధంలా ఈ సినిమను చూపించనున్నాం" అని శంకర్ ధీమా వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా, 'గేమ్ ఛేంజర్' విషయంలో తాను ఎంతో సంతృప్తిగా ఉన్నట్లు శంకర్ తెలిపారు. " ఈ సినిమాను ఎంతో అద్భుతంగా తెరకెక్కించాం. ఆ విషయంలో నేను చాలా సంతృప్తిగా ఉన్నాను. రామ్‌చరణ్ కెరీర్‌లో ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్ర ఇది. తన లుక్, స్టైల్, యాక్షన్, డైలాగ్స్, డ్యాన్స్ ఇలా అన్ని విషయాల్లోనూ చరణ్ ఎంతో అద్భుతంగా మెరిశారు. ఇదొక ఫుల్ లెంగ్త్ మాస్ కమర్షియల్ కంటెంట్" అని శంకర్ అన్నారు.