తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

దిల్​రాజు చేతికి నాని 'సరిపోదా శనివారం' - ఎన్ని కోట్లంటే?

Saripodha Sanivaaram Dilraju : గతేడాది 'దసరా', 'హాయ్ నాన్న' వంటి డీసెంట్ హిట్లను అందుకున్న నాని ప్రస్తుతం 'సరిపోదా శనివారం' సినిమా చేస్తున్నారు. ఈ సినిమా రైట్స్​ను ప్రముఖ నిర్మాత దిల్​ రాజు కొనుగోలు చేశారు. ఎన్ని కోట్లంటే?

దిల్​రాజు చేతికి నాని 'సరిపోదా శనివారం'  - ఎన్ని కోట్లంటే?
దిల్​రాజు చేతికి నాని 'సరిపోదా శనివారం' - ఎన్ని కోట్లంటే?

By ETV Bharat Telugu Team

Published : Jan 20, 2024, 2:29 PM IST

Saripodha Sanivaaram Dilraju : రీసెంట్​గా 'హాయ్ నాన్న' చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న నేచురల్ స్టార్​ నాని ప్రస్తుతం నటిస్తున్న చిత్రం 'సరిపోదా శనివారం'. ప్రియాంక మోహన్ హీరోయిన్​గా నటిస్తుండగా, ఎస్.జే సూర్య కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ మూవీ ఫుల్ స్వింగ్​లో షూటింగ్ జరుపుకుంటోంది. తాజాగా ఈ సినిమా గురించి ఓ అప్డేట్​ను ఇచ్చింది మూవీటీమ్​. తాను నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో నిర్మాత దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నారని డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ అఫీషియల్ అనౌన్స్​మెంట్​ చేసింది. ఈ మూవీ కోసం దిల్​రాజు ఏకంగా రూ. 25 కోట్లు చెల్లించినట్లు బయట కథనాలు వస్తున్నాయి.అయితే సినిమా దిల్ రాజు చేతికి వెళ్లడం వల్ల నాని సినిమాకు గ్రాండ్ రిలీజ్ దక్కే అవకాశం ఉందని అంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details