తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

చిరు కాంపౌండ్​లో సూపర్ డైరెక్టర్స్​ - ఈ కాంబోలో ఒక్క సినిమా పడితే అంతే! - సందీప్​ రెడ్డి వంగా శ్రీకాంత్ ఓదెల

Sandeep Reddy Vanga Meets Chiranjeevi : పద్మవిభూషణ్​గా చిరు ప్రమోట్​ అయిన సందర్భంగా ఆయనకు నెట్టింట విషెస్​ వెల్లువ మొదలైంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలువురు ప్రముఖులు చిరు నివాసానికి వెళ్లి ఆయనకు కంగ్రాజ్యూలేషన్స్​ తెలుపుతున్నారు. అయితే తాజాగా ఆయన్ను 'యానిమల్' డైరెక్టర్ సందీప్​ రెడ్డి వంగా, 'దసరా' డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కలిశారు.

Sandeep Reddy Vanga Meets Chiranjeevi
Sandeep Reddy Vanga Meets Chiranjeevi

By ETV Bharat Telugu Team

Published : Jan 28, 2024, 12:55 PM IST

Sandeep Reddy Vanga Meets Chiranjeevi :కేంద్ర ప్రభుత్వం ఇటీవలే మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్​ అవార్డును ప్రకటించింది. దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో సందడి వాతావరణం నెలకొంది. ఇక సోషల్ మీడియా వేదికగా కొందరు ప్రముఖులు చిరుకు కంగ్రాజ్యూలేషన్​ తెలుపుతుండగా, మరికొందరేమో ఆయన నివాసానికి వెళ్లి పర్సనల్​గా విష చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. అయితే తాజాగా ఓ ఫొటో నెటిజన్లను తెగ ఆకర్షిస్తోంది. అందులో చిరుతో పాటు 'యానిమల్' డైరెక్టర్ సందీప్​ రెడ్డి వంగా, 'దసరా' డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ఉన్నారు. చూస్తుంటే ఆ ముగ్గురు ఏదో సీరియస్​గా చర్చించుకుంటున్నట్లు తెలుస్తోంది.

దీన్ని చూసిన అభిమానులు ఈ పోస్ట్​పై రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. చిరు ఆఫ్​లైన్​ లుక్స్​ సూపర్ అంటూ కొందరు అభిప్రాయపడుతుండగా, మరికొందరేమో ఈ కాంబో ఒక్క సినిమా పడితే ఇక గూస్​బంప్సే అంటూ రాసుకొస్తున్నారు. అప్పట్లో సందీప్​ కూడా చిరంజీవితో ఓ సినిమా చేయాలని తనకు కోరికగా ఉన్నట్లు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. చుస్తూందే ఈ విషయంపైనే సందీప్​తో చిరు మాట్లాడుతున్నారేమో అంటూ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

Chiranjeevi Upcoming Movies List :ఇక చిరంజీవి ప్రస్తుతం 'విశ్వంభర' అనే సోషియో ఫాంటసీ మూవీ పనుల్లో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్​ జరగుతోంది. 'బింబిసార' మూవీ ఫేమ్‌ యంగ్ డైరెక్టర్ వశిష్ఠ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. దాదాపు వంద కోట్లకు పైగా బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి కానుకగా విడుదల చేసేందుకు మేకర్స్​ సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే తొలి షెడ్యూల్​ కంప్లీట్​ చేసుకున్న ఈ మూవీ ఫిబ్రవరీలో తదుపరి చిత్రీకరణకు సిద్ధమవుతోంది. ప్రముఖ బ్యానర్​ యూవీ క్రియేషన్స్‌ పతాకంపై వంశీ, ప్రమోద్‌, విక్రమ్‌ ఈ సినిమాకు నిర్మాణ బాధ్యతలు చేపడుతన్నారు. భారీ అంచనాల నడుమ వస్తున్న ఈ సినిమాకు ఆస్కార్​ గ్రహీత, ప్రముఖ మ్యాజిక్ డైరెక్టర్ కీరవాణి స్వరాలను సమకూరుస్తున్నారు.

చిరంజీవికి పద్మ విభూషణ్‌ - అల్లు అర్జున్‌, రామ్​చరణ్​ ఏమన్నారంటే?

మెగా 156 'విశ్వంభర' టైటిల్ కాన్సెప్ట్ వీడియో - డిజైన్ చేసింది ఈయనే!

ABOUT THE AUTHOR

...view details