తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

వాటిని ఎదుర్కొన్నా - అది నాపై ఎంతో ప్రభావం చూపింది : సమంత - Samantha Personal Life - SAMANTHA PERSONAL LIFE

Samantha Health Condition : హీరోయిన్ సమంత తన ఆరోగ్యం గురించి మాట్లాడింది. అలానే పర్సనల్ అండ్ ప్రొఫెషనల్​​ లైఫ్​ గురించి కూడా చెప్పుకొచ్చింది. పూర్తి వివరాలు స్టోరీలో.

source ANI
Samantha (source ANI)

By ETV Bharat Telugu Team

Published : Jul 16, 2024, 2:54 PM IST

Samantha Health Condition : హీరోయిన్ సమంత తన ఆరోగ్యం గురించి మాట్లాడింది. అలాగే వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలను పంచుకుంది. గతంలో కన్నా ఇప్పుడు తాను మరింత స్ట్రాంగ్​గా అయ్యానని పేర్కొంది.

జీవితంలో ఎదుర్కొన్న సమస్యలు, విడాకులు గురించి సమంత మాట్లాడుతూ - "లైఫ్​లో కొన్ని విషయాలను మార్చుకోవాలని చాలా మంది అనుకుంటూ ఉంటాం. కానీ అది సాధ్యమయ్యేవి కావు. ఏ ఛాలెంజ్​ ఎదురైనా దాన్ని అధిగమించి ముందుకెళ్లాలి. అప్పుడే సక్సెస్​ అందుకోగలం. ఆ ఇన్​స్పిరేషన్​తోనే ఇక్కడివరకు వచ్చాను. గత మూడేళ్ల కాలంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నాను. కానీ ఆధ్యాత్మికత చింతన నాలో ఎంతో మంచి మార్పును తీసుకొచ్చింది. పర్సనల్​గానే కాకుండా ప్రొఫెషనల్​గానూ ప్రభావం చూపింది. ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు చాలా మందికి చిన్న వయసులోనే అనారోగ్యం బారిన పడుతున్నారు. మెంటల్​గానూ డిస్టర్బ్​ అవుతున్నారు. కాబట్టి ఆధ్యాత్మిక చింతన ఎంతో అవసరం. అది శక్తినిచ్చే మార్గమని నమ్ముతున్నాను" అని చెప్పింది.

"సినిమాల విషయానికొస్తే వచ్చే నెలలో కొత్త మూవీ షూటింగ్​లో పాల్గొంటాను. ప్రస్తుతం నా పాత్రకు సంబంధించి ట్రైనింగ్​ తీసుకుంటున్నాను. కొత్త స్కిల్‌ నేర్చుకునే ఛాన్స్ ఉన్న కథలనే సెలెక్ట్ చేసుకోవాలని అనుకుంటున్నాను. ప్రస్తుతం హార్స్‌ రైడింగ్‌, ఆర్చరీ వంటి వాటిని నేర్చుకుంటున్నాను. నేనెప్పుడు నిత్య విద్యార్థినే. ప్రస్తుతం మహిళలకు మంచి పూర్తిస్థాయి పాత్రలు అడిగే పరిస్థితి ఇండస్ట్రీలో ఉంది. అయితే స్టీరియోటైప్స్‌ (మూసధోరణి)ను బ్రేక్‌ చేయాలి. ప్రేక్షకులకు బోర్‌ కొట్టకుండా ఉండేందుకు ఎప్పటికప్పుడు డిఫరెంట్​గా సినిమాలు చేయాలనేదే నా లక్ష్యం. కెరీర్‌ ప్రారంభించి చాలా ఏళ్లు అయిపోయినా నేనింకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఈ ప్రపంచంలో నాకు బాగా ఇష్టమైన చోటు కెమెరా ముందు నిల్చోవడమే" అని చెప్పుకొచ్చింది.

Samantha Upcoming Movies : కాగా, గతేడాది రిలీజైన ఖుషి మూవీ తర్వాత సామ్ మరో చిత్రంలో కనిపించలేదు. మయోసైటిస్‌ వల్ల కాస్త బ్రేక్ తీసుకుని లైఫ్​ను పీస్​ఫుల్​గా గడిపింది. రీసెంట్​గా మా ఇంటి బంగారం సినిమాను అనౌన్స్ చేసింది. త్వరలోనే సిటడెల్‌: హనీ- బన్నీ(Samantha Citadel) వెబ్​సిరీస్​తో ప్రేక్షకుల్ని పలకరించనుంది. ఇందులో వరుణ్‌ ధావన్‌ హీరోగా నటించగా రాజ్‌ అండ్‌ డీకే ఈ సిరీస్‌కు దర్శకత్వం వహించారు. రాజ్​ అండ్​ డీకే దర్శకత్వంలోనే మరో ప్రాజెక్ట్​కు గ్రీన్​సిగ్నల్​ ఇచ్చినట్లు తెలుస్తోంది.

సమంతపై మండిపడ్డ గ్రామీ అవార్డ్ విన్నర్!​ - ఎందుకంటే? - Samantha Ricky Kej

SIIMA 2024 అవార్డ్స్‌ నామినేషన్‌ - నాని, రజనీకాంత్ సినిమాల హవా

ABOUT THE AUTHOR

...view details