Samantha Citadel : సినిమాల షూటింగ్‌లకు ఏడాది నుంచి బ్రేక్ ఇచ్చిన స్టార్ హీరోయిన్ సమంత ఇప్పుడిప్పుడే మయోసైటిస్ రోగం నుంచి కోలుకుంటోంది. అందుకే పెండింగ్ ఉన్న తన సిటాడెల్ వెబ్‌సిరీస్‌ను రీసెంట్‌గానే కంప్లీట్ చేసింది. త్వరలోనే ఈ సిరీస్ రిలీజ్‌కు రెడీ కానుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ ప్రతిష్టాత్మకంగా దీన్ని నిర్మించింది. ఫ్యామిలీ మెన్ సిరీస్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న రాజ్ అండ్ డీకే ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్‌తో కలిసి సమంత ఈ సిరీస్‌లో నటించింది. హాలీవుడ్లో ప్రియాంక చోప్రా చేసిన పాత్రను ఇక్కడ సమంత పోషించింది. తాజాగా ఈ చిత్ర గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. సమంత దీన్ని తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఈ ప్రచార చిత్రం ఆద్యంతం యాక్షన్ ఎపిసోడ్స్‌తో నడిచింది. మరోసారి యశోద చిత్రం తర్వాత సామ్ ఈ సిరీస్‌లో యాక్షన్ పాత్రలో సందడి చేసింది.
Amazon Citadel Release Date : ఈ గ్లింప్స్ విడుదల సందర్భంగా సమంత మాట్లాడుతూ హర్షం వ్యక్తం చేసింది. యాక్షన్ చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు. కనీసం ఇలాంటి చిత్రంలో భాగం అవుతానని చివరి వరకు కూడా అనుకోలేదు. ఈ సిరీస్ కోసం శారీరకంగా చాలా శ్రమించాను. దర్శక ద్వయం రాజ్, డీకే చాలా టాలెంటెడ్ డైరెక్టర్స్. అమెరికన్ సిటాడెల్‌ను ఇండియన్ ఆడియెన్స్‌కు అందిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది ఇదొక అద్భుతమైన స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమా. సినిమాలోని సీన్స్, లవ్ స్టోరీ ఎంతో బాగుంటాయి అని చెప్పుకొచ్చింది. ఇంకా ఈ సిరీస్‌లో కే కే మేనన్, సిమ్రాన్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ కానుంది.