తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ప్రైవేట్​ జెట్​, కాస్ట్​లీ కార్లు - సౌత్​లో రిచెస్ట్​ హీరోయిన్ ఎవరంటే ? - నయన్​తార నెట్​వర్త్​

Richest Heroine In South Industry : తమ అందం, అభినయంతో సౌత్ ఇండస్ట్రీలో ఎంతో మంది ముద్దుగుమ్మలు ప్రేక్షకుల మనసుల్లో స్థానం సంపాదించుకుని దూసుకెళ్తున్నారు. అయితే ఇందులో కొంతమంది మాత్రం పాన్ ఇండియా లెవెల్​లో పాపులరై అత్యంత రిచెస్ట్ హీరోయిన్​గా దూసుకెళ్తున్నారు. అయితే సౌత్​లోనూ ఓ తార అత్యధిక రెమ్యునేరషన్ అందుకుని రిచెస్ట్ హీరోయిన్​ లిస్ట్​లో టాప్ ప్లేస్ సంపాదించుకున్నారు. ఇంతకీ ఆమె ఎవరంటే ?

Richest Heroine In South Industry
Richest Heroine In South Industry

By ETV Bharat Telugu Team

Published : Feb 28, 2024, 3:23 PM IST

Richest Heroine In South Industry :సినీ ఇండస్ట్రీకి రోజుకో కొత్త తార పరిచయం అవుతూనే ఉంటారు. తమ అందం, అభినయంతో ఆడియెన్స్​ను ఆకట్టుకుంటుంటారు. భాష ఏదైనా సరే తమ ట్యాలెంట్​తో మేకర్స్​ను ఆకర్షించి పలు హిట్ సినిమాలను తమ ఖాతాల్లో వేసుకుంటారు. హీరోయిన్లగా రాణించిన ఆ స్టార్స్ క్రమ క్రమంగా లేడీ ఓరియెంటెడ్​ సినిమాలతో తమలోని కోత్త కోణాన్ని చూపిస్తుంటారు. అప్పుడప్పుడు యాక్షన్​మోడ్​లోకి దిగి విలన్లను చిత్తు చేస్తుంటారు. అలాంటి కథనాయికలు నార్త్​ నుంచి సౌత్​వరకు ఎందరో ఉన్నారు.

ఇక సౌత్​లో ఇప్పటి నటీమణుల్లో కీర్తి సురేశ్, సమంత, అనుష్క శెట్టి, నయనతార లాంటి స్టార్స్​కు పాన్ ​ఇండియా లెవెల్​లో క్రేజ్ ఉంది. ఈ ముద్దుగుమ్మలు పరిధిని దాటి సినిమాల్లో నటిస్తూ స్టార్​డమ్​ను సంపాదించుకుంటున్నారు. హీరోలతో సమానంగా పారితోషకం అందుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సౌత్​లో ఇప్పటి వరకు అత్యథిక పారితోషకం అందుకుని సౌత్ ఇండియాలోనే అత్యంత రిచెస్ట్ హీరోయిన్​గా ఓ తార రికార్డుకెక్కారు. తెలుగు, మలయాళం, హిందీ, తమిళంలో ఇలా అన్ని భాషల్లోనూ వరుస ఆఫర్లు అందుకుని బిజీగా ఉన్నారు. ఇంతకీ ఆమె ఎవరో కాదు కోలీవుడ్ లేడీ సూపర్​స్టార్ నయనతార.

39 ఏళ్ల ఈ నటి తమిళం, తెలుగు, మలయాళ సినిమాల్లో నటించి పాపులరయ్యారు. ఇటీవలే అట్లీ తెరకెక్కించిన 'జవాన్' సినిమాతో బాలీవుడ్​లోకి ఎంట్రీ ఇచ్చారు. సినీ వర్గాల సమచారం ప్రకారం ఈ చిత్రంలో తన పాత్రకుగానూ ఆమె రూ. 10 కోట్ల రెమ్యూనరేషన్ అందుకున్నారట. అయితే నయనతార నెట్​ వర్త్​ రూ. 183 కోట్లకు మేర ఉంటుందని సమాచారం. హైదరాబాద్, చెన్నై, కేరళ ఇలా పలు ప్రాంతాల్లో ఆమెకు సొంత ఇళ్లు ఉన్నాయట. ఇవి కాకుండా ఆమెకు ఒక ప్రైవేట జెట్, ఖరీదైన కార్లు కూడా ఉన్నాయని టాక్.

ఇక బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్ , యాడ్స్, సినిమాల నిర్మాణం, సోషల్ మీడియా ప్రమోషనల్ పోస్ట్​ల ద్వారా ఆమె భారీ మెత్తంలో సంపాదిస్తున్నారని మార్కెట్​ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఇటీవలే '9 స్కిన్' అనే కాస్మటిక్స్ బ్రాండ్​ను ప్రారంభించారు. దీంతో పాటు ఇతర పెట్టుబడుల ద్వారానూ నయన్ భారీ మొత్తంలో సంపాదిస్తున్నారట నయన్.

కెరీర్​ స్వింగ్​లో ఉండగా ఇండస్ట్రీ నుంచి బ్యాన్- ఆ హీరోయిన్ ఇప్పుడేం చేస్తోందంటే?

వరుసగా 10 ఫ్లాప్స్​- అయినా కోట్లలో రెమ్యునరేషన్- ఆ స్టార్​ హీరోయిన్ ఎవరంటే?

ABOUT THE AUTHOR

...view details