Mr Bachchan Teaser:టాలీవుడ్ మాస్ మహారాజ రవితేజ హీరోగా డైనమిక్ డైరెక్టర్ హరీష్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ 'మిస్టర్ బచ్చన్'. బాలీవుడ్ మూవీ 'యారియన్-2'తో సినీ ఎంట్రీ ఇచ్చిన భాగ్య శ్రీ బోర్సే ఇందులో హీరోయిన్గా నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల కానుంది. ఈ క్రమంలో ఆదివారం మూవీటీమ్ హైదరాబాద్లో టీజర్ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ ఈవెంట్లో టీజర్ విడుదల చేశారు. మరి మీరు టీజర్ చూశారా?
హీరో- హీరోయిన్ మధ్య లవ్ట్రాక్తో టీజర్ ప్రారంభమైంది. రవితేజ, భాగ్య శ్రీ కెమిస్ట్రీ బాగా వరౌట్ అయ్యింది. ఇక 'సక్సెస్, ఫెయిల్యూర్ చుట్టాల్లాంటివి. వస్తుంటాయి, పోతుంటాయి. ఆటిట్యూడ్ ఇంటిపేరు లాంటిది అది పోయే దాకా మనతోనే ఉంటుంది' అనే డైలాగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. టీజర్లో రొమాన్స్, కామెడీ, యాక్షన్, ఫ్యామిలీ డ్రామా అన్నింటిని చూపించారు. ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్ అయిన హీరో, విలన్ జగపతిబాబు మధ్యే మెయిన్ స్టోరీ లైన్ ఉండనున్నట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది. కాగా, త్వరలోనే ట్రైలర్ రిలీజ్ కానుంది.
ఇక ఈ సినిమా ఓటీటీ డీల్స్ కూడా పూర్తైనట్లు తెలుస్తోంది. ఓటీటీ పార్ట్నర్ నెట్ఫ్లిక్స్ అని అర్థమయ్యేట్లు తాజా పోస్టర్లో కనిపిస్తోంది. దాదాపు రూ. 20కోట్లకు ఓటీటీ హక్కులు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అంటే ఓటీటీలో సినిమా క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో ఊహించుకోండి. ఓటీటీలో సినిమా ఇంత రేటు దక్కించుకుంటే ఇక థియేటర్లలో దుమ్ము లేపుతుందని అంతా భావిస్తున్నారు.