Raviteja Eagle Movie : మాస్ మహారాజా రవితేజ నటించిన యాక్షన్ థ్రిల్లర్ 'ఈగల్'. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిందీ చిత్రం. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరించారు. కావ్య థాపర్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్స్‌గా నటించారు. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడడంతో టి.జి.విశ్వప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్ని సినిమా విశేషాలతో పాటు తమ బ్యానర్లో రాబోయే చిత్రాల వివరాలను తెలియజేశారు.ఈగల్ సినిమా క్లాసిక్ స్టైలిష్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ అని చెప్పిన ఆయన - సినిమా కంటెంట్ అద్భుతంగా ఉంటుందని అన్నారు.
ఆ నమ్మకం ఉంది : "గత ఏడాదిలోనే మా 'ఈగల్' చిత్రాన్ని రిలీజ్ చేయాలని భావించాం. కానీ అవ్వలేదు. దీంతో సంక్రాంతికి అని అనుకున్నాం. దాదాపు 250 థియేటర్లతో అగ్రీమెంట్ కూడా చేసుకున్నాం. వాటితో పాటు మరో వంద థియేటర్లను ఖరారు చేసే పనిలో ఉన్నాం. అయితే చలన చిత్ర వాణిజ్య మండలి అభ్యర్థన మేరకు హీరో రవితేజతో పాటు, మా టీమ్ అంతా కలిసి పోస్ట్ పోన్ చేయాలని డిసైడ్ అయ్యాం. 'ఈగల్' మంచి ఓపెనింగ్స్‌ను అందుకుంటుందనే నమ్మకం నాకు ఉంది. ప్రమోషన్స్‌ను బాగానే దీటుగానే చేస్తున్నాం". అని విశ్వప్రసాద్ అన్నారు.