Rashmika Mandanna Birthday:'ఛలో' సినిమాతో వెండితెరకు పరిచయమైన హీరోయిన్ రష్మిక మందన్న చాలా తక్కువ కాలంలోనే పాన్ ఇండియా రేంజ్‌కు వెళ్లిపోయింది. 'పుష్ప' తర్వాత 'యానిమల్' సినిమాలు బాక్సాఫీస్‌ను షేక్ చేయడం వల్ల ఆమె క్రేజ్ రెట్టింపు అయింది. ప్రస్తుతం అటు నార్త్‌తో పాటు ఇటు సౌత్‌లోనూ దూసుకెళ్తోంది. అయితే ఈ చిన్నది తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన కెరీర్‌తో పాటు పర్సనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకుంది. తన చేతిపై ఉన్న టాటూ గురించి సీక్రెట్ రివీల్ చేసింది.
"మొదట నాకు టాటూ వేయించుకోవాలని అనిపించేది కాదు. మా కాలేజీలో ఒక అబ్బాయి 'ఆడపిల్లలు బాధను ఓర్చుకోలేరు. వాళ్లకు సూదులన్నా కూడా భయమే' అని అన్నాడు. కానీ అది తప్పు అని నిరూపించాలని అనుకున్నాను. అందుకే నేను టాటూ వేయించుకోవాలని నిర్ణయించుకున్నాను. కానీ ఏం వేయించుకోవాలని అనుకోలేదు. చాలా సేపు ఆలోచించాక నాకు ఓ ఆలోచన వచ్చింది. అందుకే ఇర్రీప్లేసబుల్ (Irreplaceable) అని వేయించుకున్నాను. ఎవరూ మరొకరిని భర్తీ చేయలేరని దాని అర్థం. ఈ విషయాన్ని నేను బాగా నమ్ముతున్నాను. ప్రతి ఒక్కరూ ముఖ్యమైన వారే. అందుకే ఆ అనే పదాన్ని వేయించుకున్నా" అని తెలిపింది.