Chiranjeevi Family At Paris Olympics :పారిస్ వేదికగా అట్టహాసంగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభోత్సవ వేడుకల్లో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి మెరిశారు. ఆయన తన భార్య సురేఖ, తనయుడు రామ్‌చరణ్, కోడలు ఉపాసన, మనవరాలు క్లీంకారతో కలిసి ఈ మెగా ఈవెంట్లో సందడి చేశారు. దానికి సంబంధించిన ఫొటోలను చెర్రీ సతీమణి ఉపాసన అభిమానుల కోసం సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి. ఇక చిరు కూడా ఒలింపిక్ జ్యోతిని పట్టుకుని ఫొటో దిగారు. దాన్ని ఆయన తన ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేశారు.
మరోవైపు చిరు ఇటీవలే 'విశ్వంభర' షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చి తన కుటుంబంతో కలిసి పారిస్‌కు వెళ్లారు. అక్కడ ఆయన తన ముద్దుల మనవరాలితో కలిసి వెకేషన్ టైమ్‌ను గడుపుతున్నారు. ఈ ట్రిప్‌కు సంబంధించిన స్పెషల్ ఫొటోలు అలాగే వీడియోలను చరణ్ అలాగే ఉపాసన తమ తమ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. తాజాగా వారందరూ కలిసి పారిస్ వీధుల్లో సరదాగా తిరిగిన ఓ వీడియోను ఉపాసన షేర్ చేశారు. అలా చేయడం ఎంతో ఆనందంగా ఉందని ఆమె పేర్కొన్నారు.
PARIS OLYMPICS 2024 OPENING CEREMONY: పారిస్ వేదికగా ఒలింపిక్స్ ఆరంభ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. సెన్ నదిపై జరిగిన 6 కిలోమీటర్ల పరేడ్‌లో 85 పడవలపై 6,000 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. సుమారు 3 లక్షలకు పైగా ప్రేక్షకులు ఈవెంట్‌ను వీక్షించేందుకు హాజరవ్వగా, వారికోసం నది పరిసరాల్లో 80 భారీ తెరలను ఏర్పాటు చేశారు. క్రీడల్లోని దిగ్గజ అథ్లెట్లు, వేర్వేరు రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు.