Rakul Preet Singh Marriage :బాలీవుడ్ క్యూట్ కపుల్ రకుల్ ప్రీత్ సింగ్ జాకీ భగ్నానీ త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారు. గోవాలో ఈ జంట ఫిబ్రవరి 21న ఒక్కటికానున్న నేపథ్యంలో ఇప్పటికే వీరి పెళ్లి పనులు జోరుగా జరుగుతున్నారు. ఇరు కుటుంబాలు కూడా బిజీ బిజీగా ఉన్నారు. తాజాగా నెట్టింట ట్రెండ్ అయిన వాళ్ల పెళ్లి కార్డు కూడా అభిమానులను తెగ ఆకట్టుకుంది. అయితే తాజాగా ఈ పెళ్లికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ విషయం నెట్టింట ట్రెండ్ అవుతోంది. అదేంటంటే ?
అతిథులకు స్పెషల్ కేర్ - ఆ హోటల్ రూమ్ ధర ఎంతంటే ?
సౌత్ గోవాలోని ఐటీసీ గ్రాండ్ హోటల్‌ను తమ పెళ్లి వేదికగా మలుచుకున్నారు రకుల్ , జాకీ జంట. ప్రశాంతమైన వాతావరణం నడుమ సుమారు 45 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ విలాసవంతమైన హోటల్‌లో మొత్తం 246 గదులు ఉన్నాయట. ప్రముఖ హోటల్ బుకింగ్స్ యాప్ ప్రకారం గోవాలోని ఐటీసీ గ్రాండ్ హోటల్‌లో ఒక్కో గది ధర రాత్రికి 19 వేల రూపాయల నుంచి దాదాపు 75 వేల రూపాయల వరకు ఉంటుందని సమాచారం. ఇందులో అదనంగా కొన్ని ట్యాక్స్‌లు కూడా ఉన్నాయట.
మరోవైపు మూడు రోజుల పాటు జరగనున్న ఈ ఈ పెళ్లి వేడుకకు సర్వం సిద్ధమవుతోంది. ఇక ఫిబ్రవరి 19 నుంచి ప్రీ వెడ్డింగ్ ప్రోగ్రామ్స్ ప్రారంభం కానున్నాయట. ఇప్పటికే రకుల్, జాకీల వివాహం పూర్తిగా ఎకో ఫ్రెండ్లీ అని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అందుకే వాళ్లు ఎవరికీ కూడా ప్రింటెడ్ ఇన్విటేషన్లు ఇవ్వలేదట. దీంతో పాటు అదే విధంగా తమ వివాహ వేడుకలో బాణాసంచాలను నిషేదించినట్లు కూడా తెలుస్తోంది.