Shankar Indian 2 Movie :ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీలో పాన్ ఇండియా ట్రెండ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో పాన్ ఇండియాతో పాటు సినిమాటిక్ యూనివర్స్ కూడా ఎక్కువగా వినిపించడం ప్రారంభమైంది. ఓ సినిమాలోని కథా ప్రపంచాన్ని లేదా, అందులోని పాత్రలను మరో సినిమాకు కనెక్ట్ చేస్తూ కొనసాగించడాన్నే సినిమాటిక్ యూనివర్స్ అంటారు. మొదట ఇలాంటి ట్రెండ్ హాలీవుడ్లో మొదలైంది.
ఆ తర్వాత ఇదే ట్రెండ్ వైపు బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ అడుగులు వేస్తున్నాయి. సౌత్ ఇండస్ట్రీకి దాన్ని పరిచయం చేసిన క్రెడిట్ దర్శకుడు లోకేశ్ కనగరాజ్దే. ఖైదీ (2019), విక్రమ్ (2022), లియో(2023) సినిమాలు ఆ కోవకే వస్తాయి. అయితే 2008లోనే ఆ సాహసం చేయాలని డైరెక్టర్ శంకర్ ప్రయత్నించారని తెలిసింది. కానీ, అది కార్యరూపం దాల్చలేదు.
తాజాగా ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. "రోబో షూటింగ్ టైమ్లో నాకు సినిమాటిక్ యూనివర్స్ చేయాలనే ఆలోచన వచ్చింది. భారతీయుడు, ఒకే ఒక్కడు, శివాజీలోని హీరోల పాత్రలను కలుపుతూ ఓ సినిమా చేయాలనిపించింది. ఈ విషయాన్ని నా అసిస్టెంట్ డైరెక్టర్లకు, కుటుంబ సభ్యులు, స్నేహితులకు వివరించాను. వారందరూ నవ్వారు. వారి సపోర్ట్ దక్కక నా ఆలోచనను మానుకున్నాను. కానీ ఆ తర్వాత అవెంజర్స్ వచ్చింది. దీంతో కొత్త తరహా ఆలోచనలతో సినిమా తీయాలనుకుంటే తీసేయండి. లేదంటే ఇంకెవరో చేస్తారు అని నా అసిస్టెంట్లకు చెప్పారజనీకాంత్, కమల్ హాసన్, అర్జున్: ‘సినిమాటిక్ యూనివర్స్’పై శంకర్ ఏమన్నారంటే? అని చెప్పారు శంకర్. అప్పుడు శంకర్ అనుకున్నది చేసి ఉంటే శంకర్ సినిమాటిక్ యూనివర్స్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫస్ట్ యూనివర్స్ అయ్యేది.