Fahadh Faasil Remuneration:వైవిధ్య చిత్రాలతో ప్రేక్షకుల్లో స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న నటుడు ఫహద్ ఫాజిల్. ఈ మలయాళ సూపర్ యాక్టర్ అల్లు అర్జున్ 'పుష్ప: ది రైజ్' తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. మొదటి భాగంలో భన్వర్ సింగ్ షెకావత్‌గా నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. ప్రస్తుతం పుష్ప- 2లోనూ ఫహాద్ నటిస్తున్నారు. ఓ వైపు సినిమాల్లో విలన్‌గా నటిస్తూనే, మరోవైపు ఇతర చిత్రాల్లో హీరోగా రాణిస్తూ వరుస సక్సెస్‌లను అందుకుంటున్నారు. రీసెంట్గా 'ఆవేశం' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చి భారీ సక్సెస్ ఖాతాలో వేసుకున్నారు. అయితే ఈ సహజ నటుడి రెమ్యూనరేషన్ గురించి ఓ వార్త చక్కర్లు కొడుతోంది.
రోజుకు ఎంతంటే?
ఫహాద్ ఫాజిల్ రోజుకు రూ.12 లక్షలు రెమ్యూనరేషన్ తీసుకుంటారట. ఒకవేళ తాను డేట్లు ఇచ్చి షూటింగ్ క్యాన్సిల్ అయితే అదనంగా మరో రూ.2 లక్షలు ఇవ్వాలని ఈ నటుడు షరతులు విధించారట. అంటే మొత్తంగా రోజుకు రూ.14 లక్షలు అన్నమాట. ఈ విధంగా కండీషన్స్ పెట్టడం వల్ల తన డేట్లు వృథా అయ్యే అవకాశం ఉండదని ఫహాద్ భావిస్తున్నారట. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న పుష్ప-2 కి కూడా ఫహాద్ ఫాజిల్ రోజుకు భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు నెట్టింట చర్చ జరుగుతోంది. ఫహాద్ ఫాజిల్ రెమ్యునరేషన్ లెక్కలు విని నెటిజన్లు షాకవుతున్నారు. ఒకరోజుకు ఫహాద్ ఇంత భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారా అని ఆశ్చర్యపోతున్నారు.