Pushpa 2 Collection :ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప 2' బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ కొనసాగుతోంది. డిసెంబర్ 5న రిలీజైన ఈ సినిమా భారీ విజయం సాధించింది. ఈ క్రమంలోనే పుష్ప 2 సినిమా ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.1705 కోట్లు వసూళ్లు సాధించింది. ఈ మేరకు మేకర్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. అయితే ఈ స్థాయి వసూళ్లు కేవలం 21 రోజుల్లోనే రావడం విశేషం.
హిందీలో రికార్డులు
బాలీవుడ్లో 'పుష్ప'కు రిలీజ్ ముందు నుంచే విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇక సినిమాకు మంచి టాక్ రావడం వల్ల హిందీ వసూళ్లలో పుష్పరాజ్ జోరు ప్రదర్శిస్తున్నాడు. ఒక్క హిందీలోనే ఈ సినిమా రూ.700 కోట్ల నెట్ వసూల్ చేసింది. ఈ క్రమంలో బాలీవుడ్ హిస్టరీలో తెలుగు సినిమాకు ఈ స్థాయిలో వసూళ్లు రాలేదని ట్రేడ్ వర్గాలు తెలిపాయి.
బాహుబలి- 2 దగ్గరలో
ఇక తెలుగు ఇండస్ట్రీ ఆల్టైమ్ హెయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా 'బాహుబలి 2' టాప్లో ఉంది. 2017లో విడుదలైన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.1800+ పైగా వసూళ్లు సాధించింది. ఈ క్రమంలో 'పుష్ప 2' ప్రస్తుతం బాహుబలి వసూళ్లకు అతి దగ్గరగా ఉంది. ఇక ఇటీవల ఈ సినిమా 3D వెర్షన్ కూడా రిలీజైంది. అలాగే ఈ వీకెండ్లో బడా సినిమాల రిలీజ్లు లేకపోవడం వల్ల 'పుష్ప 2' జోరు మరో వారం కొనసాగే ఛాన్స్ ఉంది. ఈ లెక్కన త్వరలోనే 'బాహుబలి 2'ని 'పుష్ప 2' దాటేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.