తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'సూసేకి అగ్గి రవ్వ' - పుష్ప 2పై దేవీ శ్రీ ఇంట్రెస్టింగ్ అప్డేట్ - Pushpa 2 Songs - PUSHPA 2 SONGS

Pushpa 2 Sooseki Aggi Ravva Song : పుష్ప 2 గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు దేవీ శ్రీ ప్రసాద్. విశేష ఆదరణ దక్కించుకున్న సూసేకి అగ్గి రవ్వ పాటపై కూడా మాట్లాడారు. పూర్తి వివరాలు స్టోరీలో.

source ETV Bharat
Pushpa 2 Sooseki Aggi Ravva Song (source ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jul 17, 2024, 4:10 PM IST

Pushpa 2 Sooseki Aggi Ravva Song : పుష్ప 2 గురించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్​గా ఈ చిత్రం నుంచి విడుదలైన రెండు సాంగ్స్​కు విశేష ఆదరణ దక్కింది. ముఖ్యంగా సూసేకి అగ్గి రవ్వ పాటపై సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్‌ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అలానే తన మ్యూజికల్‌ కాన్సర్ట్‌ గురించి కూడా మాట్లాడారు.

"బన్నీ- సుకుమార్‌ కాంబో మరోసారి కచ్చితంగా మ్యాజిక్‌ చేస్తుంది. పుష్ప 1 బ్లాక్‌ బస్టర్‌ హిట్​ కావడం వల్ల పుష్ప 2పై వరల్డ్​వైడ్​గా ఆడియెన్స్​లో అంచనాలు భారీగా పెరిగాయి. అయినా నేను ఒత్తిడి లేకుండానే పని చేస్తున్నాను. ఆడుతూ పాడుతూ ముందుకు వెళ్తున్నాను. ఇప్పటికే రిలీజైన రెండో భాగంలోని సాంగ్స్​కు విశేష ఆదరణ దక్కడం ఎంతో ఆనందంగా ఉంది. ముఖ్యంగా సూసేకి అగ్గిరవ్వ మాదిరి పాట అన్ని భాషల వారికి బాగా కనెక్ట్‌ అయిపోయింది. అస్సాంలో రీసెంట్​గా జరిగిన ఓ వేడుకకు వెళ్లాను. అక్కడ కూడా ఆ పాటే వినిపించింది" అంటూ చెప్పుకొచ్చారు.

"మిమ్మల్ని చూసే సూసేకి అగ్గిరవ్వ సాంగ్​ రాశారా?" అని అడగగా చిత్రంలోని అల్లు అర్జున్‌ పాత్రను ఉద్దేశించి రాశారని నవ్వుతూ బదులిచ్చారు దేవీ శ్రీ. "లిరికల్‌ వీడియో సాంగ్​లో మీరు చూసింది కొంత మాత్రమే. అందులో మేకింగ్‌ మాత్రమే కదా చూపించింది. అసలైన డ్యాన్స్‌ ఇంకా రివీల్‌ చేయలేదు. పిక్చరైజేషన్‌లో ది బెస్ట్‌ సాంగ్స్‌లో అది కూడా ఒకటి. విజువల్‌ పరంగా ఆ సాంగ్​ మరో స్థాయిలో ఉంటుంది" అని దేవీ శ్రీ సినిమాతో పాటు పాటలపై ఆసక్తి రేకెత్తించారు.

ఇంకా హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో మ్యూజికల్‌ కాన్సర్ట్‌ నిర్వహించనున్నట్టు తెలిపారు దేవీ శ్రీ. అక్టోబరు 10న ఈ వేడుక జరగనుందని, రొటీన్‌కు భిన్నంగా ఆ వేడుక సాగుతుందని పేర్కొన్నారు. ఇకపోతే పుష్ప 2లో ఫహాద్ ఫాజిల్, అనసూయ, సునీల్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ ఏడాది డిసెంబర్​లో(Pushpa 2 Release Date) మూవీ రిలీజయ్యే ఛాన్స్ ఉంది.

'నొప్పి భరించలేనంతగా ఉంది' - యాక్సిడెంట్​పై నవీన్​ పోలిశెట్టి అప్డేట్​ - Naveen Polishetty Health Update

NBK 109 - అలాంటి టైటిల్ వద్దంటున్న ఫ్యాన్స్!

ABOUT THE AUTHOR

...view details