Pushpa 2 Release Competition:ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న పుష్ప- 2 (ది రూల్) చివరకు ఆగస్టు 15న గ్రాండ్‌గా రిలీజ్ కానున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. పుష్ప పార్ట్- 1 (ది రైజింగ్) పాన్ ఇండియాలో స్థాయిలో భారీ విజయాన్ని అందుకోవడం వల్ల ఈ సీక్వెల్‌పై అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి. తొలి పార్ట్‌కు దాదారు రూ.300+ కోట్లపై కలెక్షన్లు సాధించిన ఈ సినిమా, సీక్వెల్‌కు రూ.500+ కోట్లు దాటవచ్చని ట్రేడ్ వర్గాల అంచనా.
అయితే పుష్పకు బాక్సాఫీస్ వద్ద పోటీ ఎక్కువగానే ఉండేలా ఉంది. అగస్టు 15డేట్‌ను లాక్ చేసుకునేందుకు పలు సినిమాలు రెడీ అవుతున్నాయి. ఇప్పటికే బాలీవుడ్లో అజయ్ దేవ్గన్ 'సింగం అగైన్' సినిమా ఆగస్టు 15నే రిలీజ్ కానుంది. ఇక ఈ జాబితాలో జూనియర్ ఎన్టీఆర్- కొరటాల శివ 'దేవర పార్ట్- 1'తోపాటు కోలీవుడ్ నుంచి 'ఇండియన్ 2', 'కంగువ', 'వెట్టయన్' చిత్రాలు కూడా ఆగస్టు 15 మీదే కన్నేశాయి. మరోవైపు నేచురల్ స్టార్ నాని కూడా 'సరిపోదా శనివారం' ఆగస్టు 15నే వచ్చేలా ప్లాన్ చేస్తున్నారట.
అయితే ఇంతమంది స్టార్ల సినిమాలు ఒకేసారి రిలీజైతే థియేటర్లు అడ్జెస్ట్ అవ్వడం కష్టం. ఈ నేపథ్యంలోనే పుష్పరాజు రూల్ నడుస్తుందా లేదా అన్నది కూడా చర్చగా మారింది. ఎందుకంటే పుష్ప తెలుగులో కన్నా కూడా హిందీలో భారీ విజయం సొంతం చేసుకుంది. నిజానికి పుష్ప మూవీ తెలుగులో మంచి టాక్ తెచ్చుకున్నప్పటికీ కరోనా కారణంగా అనుకున్న స్థాయిలో జనాలు థియేటర్లకు రాలేదు. కొవిడ్ కారణంగా పుష్ప కు తెలుగు రాష్ట్రాల్లో ఊహించిన రేంజ్ కలెక్షన్లు దక్కలేదు. కానీ, అనూహ్యంగా ఈ సినిమా హిందీలో అద్భుతమైన విజయం సాధించింది. అల్లు అర్జున్ను జాతీయస్థాయిలో ఉత్తమ నటుడిగా నిలపడంలో పుష్ప సినిమా హిందీలో సాధించిన విజయమే ఒక కారణంగా చెప్పవచ్చు.