Pushpa 2 Pre Release Event Hyderabad :ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప 2' ప్రమోషన్స్‌లో బిజీ బిజీగా ఉన్నారు. మూవీటీమ్ ఇప్పటికే చెన్నై, కోచి నగరాల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా, శుక్రవారం ముంబయిలో ప్రెస్మీట్లో పాల్గొంది. దేశవ్యాప్తంగా ఈవెంట్లు పూర్తి చేసుకున్న మూవీటీమ్, ఇక తెలుగు అభిమానుల కోసం మాస్ జాతర నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో మేకర్స్ ఈవెంట్ డేట్ అనౌన్స్ చేస్తూ, మాస్ పోస్టర్ రిలీజ్ చేశారు.
పుష్ప తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ డిసెంబర్ 2న జరగనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ ఈవెంట్‌కు హైదరాబాద్ యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ వేదిక కానుంది. ఈ మేరకు 'హైదరాబాద్‌లో పుష్ప వైల్డ్ ఫైర్ జాతర' అంటూ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమం సోమవారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభం కానుంది. దీంతో బన్నీ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
కాగా, ఈ ఈవెంట్ చాలా గ్రాండ్‌గా నిర్వహించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. పటిష్ఠ భద్రత మధ్య కార్యక్రమం జరగనుంది. ఇక ఈ ఈవెంట్‌కు హీరో బన్నీ సహా హీరోయిన్ రష్మిక మంధన్నా, డ్యాన్స్ క్వీన్ శ్రీలీల హాజరుకానున్నారు. అలాగే తెలుగు ఇండస్ట్రీ నుంచి పలువురు ప్రముఖుల కూడా ఈవెంట్లో కనిపించనున్నారని ఇన్సైట్ టాక్ వినిపిస్తోంది. ఇక అల్లు అర్జున్ స్పీచ్ కోసం బన్నీ ఫ్యాన్స్ తెగ వెయిట్ చేస్తున్నారు.