Rashmika Mandanna Marriage : నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి తెలిసిందే. టాలీవుడ్ టు బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా కెరీర్లో ముందుకెళ్తోంది. గతేడాది యానిమల్ చిత్రంతో భారీ విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ అరడజనుకు పైగా సినిమాలను చేస్తోంది. అయితే ఈ భామ టాలీవుడ్‌కు చెందిన ఓ హీరో రిలేషన్లో ఉందంటూ గత కొంత కాలంగా రూమర్స్ వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. వారిద్దరు కలిసి దిగిన ఫొటోలు ఎప్పుడైనా కనిపిస్తే సోషల్ మీడియా అంతా కూడా ఈ విషయమై చర్చలు జరుగుతుంటాయి. అయితే తాజాగా రష్మిక తన పెళ్లి విషయమై స్పందించింది. తాజాగా 'కిస్సిక్' సాంగ్‌ను చెన్నై వేదికగా జరిగిన పుష్ప వైల్డ్ ఫైర్ వేడుకలో రిలీజ్ చేశారు. ఆ వేదికపై రష్మిక కూడా సందడి చేశారు. ఈ సందర్భంగానే ఆమె తన పెళ్లి గురించి మాట్లాడింది.
"నా జీవితాన్ని పూర్తిగా మార్చేసిన చిత్రం పుష్ప" అని మొదట చెప్పింది రష్మిక. అప్పుడు ఈ వేడుక సందర్భంగా వేదికపై ఉన్న వ్యాఖ్యాతలు రష్మికను పెళ్లి విషయమై కూడా ప్రశ్నించారు. 'ఇండస్ట్రీ చెందిన వ్యక్తిని చేసుకుంటారా? లేదా బయట వ్యక్తినాట అని అడిగారు. "దీనికి సమాధానం అందరికీ తెలుసంటూ" రష్మిక చిరు నవ్వులు చిందించింది. ఆమె ఈ సమాధానం చెబుతూ చిరు నవ్వులు చిందించడం ఆ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఒక్క సారిగా ఆడిటోరియం మొత్తం ఊగిపోయింది. అక్కడే కూర్చొని ఉన్న అల్లు అర్జున్, శ్రీలీల కూడా రష్మిక సమాధానానికి నవ్వారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో కూడా నెట్టింట తెగ వైరల్ అవుతోంది.