తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

అలా చేయాలని ఉంది, భలే అందంగా చూపిస్తారు : పురుషోత్తముడి ముద్దుగుమ్మ - Purushothamudu Hassini Sudhir

Purushothamudu Heroine Hassini Sudhir : టాలీవుడ్​లో తన ఫేవరెట్ హీరో ఎవరో చెప్పారు పురుషోత్తముడు హీరోయిన్ హాసిని సుధీర్. ఈ చిత్రంతోనే ఆమె తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను పంచుకున్నారు. పూర్తి వివరాలు స్టోరీలో

source ETV Bharat
Purushothamudu Heroine Hassini Sudhir (source ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jul 25, 2024, 6:22 PM IST

Purushothamudu Heroine Hassini Sudhir :టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా నటించిన కొత్త సినిమా పురుషోత్తముడు. ఈ చిత్రాన్ని శ్రీ శ్రీదేవి ప్రొడక్షన్స్ బ్యానర్​పై డా.రమేశ్​ తేజావత్, ప్రకాశ్​ తేజావత్ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ చిత్రంతోనే హాసిని సుధీర్ హీరోయిన్​గా పరిచయమవుతున్నారు. ఆకతాయి, హమ్ తుమ్ చిత్రాలతో దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రామ్ భీమన ఈ పురుషోత్తముడును తెరకెక్కించారు. ప్రకాశ్​ రాజ్, మురళి శర్మ, రమ్య కృష్ణ, బ్రహ్మానందం, ముకేశ్​ ఖన్నా వంటి స్టార్ కాస్టింగ్​తో రూపొందిన ఈ సినిమా ఈ నెల 26న థియేట్రికల్ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా తాజాగా జరిగిన ప్రెస్ మీట్​లో పురుషోత్తముడు చిత్ర విశేషాలు తెలిపారు హీరోయిన్ హాసినీ సుధీర్. అలాగే తన బ్యాక్​గ్రౌండ్ డీటెయిల్స్​ను తెలిపారు.

ఆయనే నా ఫేవరెట్ హీరో - "నేను మహారాష్ట్ర అమ్మాయిని. హీరోయిన్ కావాలనేది నా చిన్నప్పటి కల. ముంబయిలో మోడలింగ్ చేశాను. తెలుగు సినిమాలు బాగా చూస్తూ పెరిగాను. అలా తెెలుగు నేర్చుకున్నాను. నాని నా ఫేవరేట్ హీరో. డైరెక్టర్ రామ్ భీమన గారు పురుషోత్తముడు సినిమా ఆడిషన్ కు పిలిచారు. ఆడిషన్ తర్వాత నన్ను సెలెక్ట్ చేశారు. ఈ సినిమాలో సెలెక్ట్ అయ్యాక ఏడాది పాటు వర్క్ షాప్​లో పాల్గొన్నాను."

అప్పుడు కాస్త ఇబ్బంది పడ్డా - "పురుషోత్తముడు చిత్రంలో నేను అమ్ములు అనే పాత్ర చేశాను. అంతా అమ్ము అని పిలుస్తారు. తనొక బబ్లీ గర్ల్. అందరితో పని చేయిస్తుంటుంది. హీరోతో కూడా పని చేయిస్తుంది. ఈ క్యారెక్టర్​లో నటించడాన్ని ఎంజాయ్ చేశాను. నాకు తెలుగు మాట్లాడటం వచ్చినా చదవడం రాదు. రాజమండ్రి షెడ్యూల్ కోసం వెళ్లి ఫస్ట్ డే షూట్​లో పాల్గొన్పప్పుడు ఇబ్బంది పడ్డాను. సినిమాలో అంతా సీనియర్స్ కాబట్టి సపోర్ట్ చేశారు."

అలా నటించాలనుకున్నా - "రాజ్ తరుణ్​తో కలిసి నటించడం హ్యాపీగా ఉంది. సెట్స్​లో తన సపోర్ట్ అందించేవారు. మా డైరెక్టర్ రామ్ భీమన గారికి థ్యాంక్స్ చెబుతున్నాను. మా ప్రొడ్యూసర్స్ మమ్మల్ని అందరినీ ఒక ఫ్యామిలీ మెంబర్స్​లా చూసుకున్నారు. నా మొదటి చిత్రంలోనే చాలా మంది పెద్ద ఆర్టిస్టులతో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాను. ప్రకాశ్​ రాజ్, రమ్యకృష్ణ లాంటి స్టార్స్ కళ్లతోనే నటిస్తారు. నేనూ అలా నటించాలని అనుకునేదాన్ని."

అందంగా చూపిస్తారు - "పురుషోత్తముడు సినిమా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. మీరంతా కుటుంబతో వెళ్లి చూడండి. ఈ సినిమాను ఒక ఆడియెన్​గా చూసినప్పుడు హోల్ సమ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అనే ఫీల్ కలిగింది. తెలుగు సినిమాల్లో తెలుగు హీరోయిన్స్ తక్కువ మంది ఉన్నారు. తెలుగమ్మాయిని కాకున్నా తెలుగు మాట్లాడుతున్నందువల్ల నన్ను ఇక్కడి అమ్మాయిలాగే చూస్తున్నారు. తెలుగు సినిమాల్లో హీరోయిన్స్​ను అందంగా చూపిస్తారు. అందుకే నాకు తెలుగు సినిమాలంటే ఇష్టం. లవ్ స్టోరీస్​తో పాటు యాక్షన్ మూవీస్ కూడా చేయాలని ఉంది. ప్రస్తుతం కొన్ని సినిమాల ఆఫర్స్ వస్తున్నాయి. మీ అందరి సపోర్ట్ నాకూ, మా పురుషోత్తముడు సినిమాకు అందిస్తారని కోరుకుంటున్నాను." అని చెప్పుకొచ్చారు.

రాజ్‌ తరుణ్‌ 'పురుషోత్తముడు' అంటున్న ప్రకాశ్ రాజ్​! - Rajtarun purushothamudu

రాజ్​ తరుణ్​కు రూ.70 లక్షలు ఇచ్చాను - నాకు అబార్షన్​ కూడా చేయించాడు : నటి లావణ్య - FIR FILED AGAINST ACTOR RAJ TARUN

ABOUT THE AUTHOR

...view details