ETV Bharat / entertainment

212 రోజులు, 6 షెడ్యుల్స్​లో షూటింగ్​​ - రెండు భాగాలుగా అనుష్క కొత్త సినిమా - ANUSHKA SHETTY KATHANAR

హీరోయిన్​ అనుష్క నటిస్తున్న కొత్త సినిమా ఫాంటసీ థ్రిల్లర్​ అప్డేట్​!

Anushka Shetty Fantasy Thriller Kathanar
Anushka Shetty Fantasy Thriller Kathanar (source ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 18, 2024, 10:11 AM IST

Anushka Shetty Fantasy Thriller Kathanar : హీరోయిన్ అనుష్క ప్రస్తుతం ఒకే సారి రెండు చిత్రాలలో నటిస్తున్నారు. ఈ రెండూ షూటింగ్ జరుపుకుంటున్నాయి. దీంతో సెట్స్‌పై ఆమె తీరిక లేకుండా గడుపుతున్నారు. ఈ చిత్రాల్లో కథనార్‌ - ది వైల్డ్‌ సోర్సెరర్‌ ఒకటి. ఇది అనుష్కకు మొదటి మలయాళ సినిమా.

రోజిన్‌ థామస్‌ ఈ కథనార్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. గోకులం గోపాలన్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. జయ సూర్య హీరోగా నటిస్తున్నారు. హారర్‌ ఫాంటసీ థ్రిల్లర్‌గా ఇది ముస్తాబవుతోంది. తాజాగా ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ఆ మధ్య ప్రచారం సాగింది. అలాగే ఈ మూవీ షూటింగ్​ కూడా పూర్తైనట్లు వార్తలు వచ్చాయి.

తాజాగా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది చిత్ర బృందం. 212 రోజుల పాటు 6 షెడ్యూల్స్‌లో చిత్రీకరణ పూర్తి చేసుకున్నట్లు దర్శకుడు రోజిన్ థామస్ చెప్పారు. 9వ శతాబ్దపు క్రైస్తవ మత గురువు కడమత్తత్తు కథనార్‌ కథను ఆధారం ఈ సినిమాను తెరకెక్కించారు. చిత్రంలో అనుష్క మునుపెన్నడూ చూడని భిన్నమైన అవతారంలో కనిపించనుందట.

ప్రస్తుతం కథనార్​ నిర్మాణానంతర పనులు శరవేగంగా సాగుతున్నాయి. సినిమాను 14 భాషల్లో విడుదల చేయనున్నారట. త్వరలోనే మూవీ విడుదల తేదీపై స్పష్టత రానుంది. ఈ సినిమాకు రాహుల్‌ సుబ్రహ్మణ్యం సంగీతం అందించారు. నీల్‌ డి కున్హా ఛాయాగ్రహణం బాధ్యతలు చూసుకున్నారు. కేరళలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

Anushka Shetty Krish Jagarlamudi movie : ఇకపోతే అనుష్క శెట్టి తెలుగులోనూ ఓ సినిమా చేస్తున్నారు. దర్శకుడు క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వంలో ఘాటీ అనే సినిమా చేస్తున్నారు. బలమైన కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతోందని, ఇందులో సవాల్‌తో కూడిన పాత్రలో అనుష్క కనిపించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.

కాగా, అనుష్క చివరగా మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి సినిమాలో కనిపించారు. గత ఏడాది విడుదలైన ఈ చిత్రాన్ని పి. మహేష్ బాబు దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన దక్కింది.

అనుష్క రివీల్​ చేసిన 'సూడోబుల్బర్ ఎఫెక్ట్' - అది వస్తే నవ్వినా ఏడ్చినా అస్సలు ఆపుకోలేరట! - ANUSHKA SHETTY RARE DISEASE

'కౌన్‌ బనేగా కరోడ్‌పతి'లో అల్లు అర్జున్ పై ప్రశ్న - ఏమని అడిగారంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.