IND vs NZ 1st Test Pant Injury : టీమ్ ఇండియా - న్యూజిలాండ్ జట్ల మధ్య మొదటి టెస్ట్ మూడో రోజు ఆట మొదలైపోయింది. కానీ టీమ్ ఇండియాకు పెద్ద ఎదురుదెబ్బ తప్పేలా లేదు. ఎందుకంటే రెండో రోజు వికెట్ కీపింగ్ చేస్తున్నప్పుడు పంత్ గాయపడిన సంగతి తెలిసిందే. అతడు మూడో రోజు వికెట్ కీపింగ్‌కు దిగలేదు. దీంతో ప్రస్తుతం అతడి గాయం తీవ్రతపై అభిమానుల్లో ఆందోళన నెలకొంది. అతడికి ఏమైందనే ప్రశ్నలూ ఎదురౌతున్నాయి. బీసీసీఐ కూడా దీనిపై స్పందించింది. తమ మెడికల్ టీమ్ నిరంతరం పర్యవేక్షిస్తోందని చెప్పింది. అతడు మళ్లీ మైదానంలోకి దిగేందుకు కృషి చేస్తున్నాడని వెల్లడించింది. కాగా, ప్రస్తుతం పంత్ స్థానంలో ధ్రువ్ జురెల్ వికెట్ కీపింగ్ చేస్తున్నారు.
అసలు పంత్‌కు ఏమైంది? - రెండో రోజు గేమ్‌లో జడేజా వేసిన ఇన్నింగ్స్ 37వ ఓవర్లో లాస్ట్ బాల్ తక్కువ ఎత్తులో వచ్చి పంత్ కుడి మోకాలికి తాకింది. ఆ సమయంలో పంత్ నొప్పితో విలవిలలాడడంతో బంతి బలంగా తాకినట్టు అర్థమైంది. ఫిజియో వచ్చి అతడిని పరీక్షించి సిబ్బంది సాయంతో బయటకు తీసుకెళ్లారు. అసలే ఆ మధ్య రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ప్రాణాలతో బయట పడిన పంత్ రైట్ లెగ్‌కు మోకాలి శస్త్రచికిత్స జరిగింది. ఇప్పుడు అక్కడే బాల్ డైరెక్ట్‌గా వెళ్లి తగిలింది. అందుకే అతడు నొప్పితో మైదానం వీడాడు. దీంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.
బ్యాటింగ్‌కు దిగకపోతే కష్టమే - ఈ మ్యాచ్‌లో టీమ్ ఇండియా మొదటి ఇన్నింగ్స్‌లో పంతే టాప్ స్కోరర్ ఉన్నాడు. భారత్ చేసిన 46 రన్స్‌లో పంత్‌వే 20 పరుగులు. ఒక వేళ సెకండ్ ఇన్నింగ్స్‌లో టీమ్ ఇండియా భారీ స్కోరు చేయాలంటే పంత్ మరోసారి కీలకంగా ఆడాలి. కానీ ఇప్పుడు మిడిలార్డర్‌లో దిగే పంత్ బ్యాటింగ్‌కు దిగకపోతే జట్టుకు నష్టమనే చెప్పాలి.
అయితే, అతడు కాస్త కోలుకుని రెండో ఇన్నింగ్స్‌కు రావాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఇదే సమయంలో పంత్ విషయంలో రిస్క్ చేయలమేని కెప్టెన్ రోహిత్ అనడం కూడా ఆందోళకు గురి చేస్తోంది.
ఏదేమైనా ప్రస్తుతం న్యూజిలాండ్‌తో మరో రెండు టెస్టులతో పాటు నెక్ట్స్ ఆస్ట్రేలియా పర్యటన ఉన్న నేపథ్యంలో ఈ ఒక్క మ్యాచ్ కోసం పంత్ తీసుకునే విషయమై రిస్క్ చేయకపోవచ్చనే ప్రచారం సాగుతోంది.
భారత జట్టు నుంచి స్టార్ వికెట్ కీపర్ ఔట్! - ఇంటర్ పరీక్షల కోసం వన్డే సిరీస్‌కు దూరం!
అంబానీ చిన్న కోడలి బర్త్‌డే పార్టీ సెలబ్రేషన్స్ - రణ్వీర్, ధోనీ సందడి