Double Ismart Steppa Maar Song : రామ్ పోతినేని హీరోగా దర్శకుడు పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న డబుల్ ఇస్మార్ట్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఆగస్టు 15న విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గరపడడంతో ప్రమోషన్స్‌ను ప్రారంభించారు మేకర్స్. ఇందులో భాగంగానే మొదటగా మ్యూజికల్ ప్రమోషన్స్‌ను ప్రారంభించారు. మొదటి భాగానికి చార్ట్-బస్టర్ ఆల్బమ్, అద్భుతమైన బీజీఎమ్ అందించిన మ్యాజికల్ కంపోజర్ మణిశర్మనే ఇప్పుడు రెండో భాగానికి సంగీతాన్ని సమకూర్చారు.
అయితే ఇప్పుడు తాజాగా స్టెప్ మార్ అంటూ సాగే లిరికల్ సాంగ్‌ను మూవీటీమ్ తాజాగా రిలీజ్ చేశారు మేకర్స్. శివుడు బ్యాక్‌డ్రాప్‌తో చార్మినార్, గోల్కొండ కోట సహా హైదరాబాద్‌లోని పలు లొకేషన్స్‌లో సాంగ్‌ను చిత్రీకరించారు. ఇందులో రామ్ కంప్లీట్ స్టైలిశ్ వైబ్‌లో డ్యాన్స్ చేస్తూ ఓ ఊపు ఉపేశారు. ఆయన స్టెప్స్ సాంగ్‌కు హైలైట్‌గా ఉన్నాయి. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పాటకు కొరియోగ్రఫీ చేయగా, భాస్కర భట్ల లిరిక్స్, అనురాగ్ కులకర్ణి వోకల్స్‌ను అందించారు. మొత్తంగా ఈ సాంగ్ ఎలక్ట్రిఫైయింగ్ ట్యూన్‌గా మాస్ ప్రేక్షకులకు ఇన్‌స్టంట్ ఎడిక్షన్ ఇచ్చేలా ఉంది.