తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'ఇండస్ట్రీలో ఎవరూ ఎవరినీ సపోర్ట్ చెయ్యరు!' - KA MOVIE SUCCESS MEET

'క' సక్సెస్ మీట్- కిరణ్ ఎమోషనల్ స్పీచ్​కు దిల్​రాజు రియాక్షన్- నిర్మాత ఇంట్రెస్టింగ్ కామెంట్స్

KA Movie success Meet
KA Movie success Meet (Source: ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Nov 9, 2024, 7:25 AM IST

KA Movie success Meet :యంగ్ హీరో కిరణ్ అబ్బవరం లీడ్ రోల్​లో నటించిన లేటెస్ట్ చిత్రం 'క' (KA). యువ దర్శకులు సుజీత్, సందీప్‌ సంయుక్తంగా ఈ సినిమా తెరకెక్కించారు. గతనెల 31న రిలీజైన ఈ సినిమా భారీ విజయం దక్కించుకుంది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ క్రమంలో మేకర్స్​ హైదరాబాద్​లో శనివారం సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్​కు ప్రముఖ నిర్మాత దిల్​రాజు హాజరయ్యారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్​లో హీరో కిరణ్ ఎమోషనల్ స్పీచ్​కు దిల్​రాజు స్పందించారు.

'2024 దీపావళి ఇండస్ట్రీలో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈ దీపావళికి బాక్సాఫీస్‌ దగ్గర తీవ్ర పోటీ నెలకొంది. ఈ పోటీలో వచ్చిన ఐదుకు ఐదు సినిమాలు విజయాలు సాధించాయి. ఇలాంటి దీపావళి మళ్లీ వస్తుందో తెలియదు. తీవ్ర పోటీని తట్టుకుని 'క' సినిమా విజయం సాధించడం మామూలు విషయం కాదు. ఈ విజయానికి కారణం సమష్టి కృషే. ఇక్కడ ఎవరిని వాళ్లే నిరూపించుకోవాలి. టాలెంట్ ఉంటేనే కిరణ్ ఈరోజు సక్సెస్ అయ్యాడు. ఇక్కడ కేవలం టాలెంట్ ఉండాలి. అంతేగాని ఇండస్ట్రీలో ఎవరూ ఎవరికి సపోర్ట్ చెయ్యరు. అలాగని వెనక్కు లాగరు. సక్సెస్ వస్తే మా లాంటి వళ్లు అభినందించడానికి మాత్రమే వస్తాం. మన కంటెంట్‌తో మనమే పేక్షకుల దగ్గరకి వెళ్లాలి' అని దిల్​రాజు అన్నారు.

డిఫరెంట్ కాన్సెప్ట్
'క' మూవీ కొత్త కాన్సెప్ట్​తో తెరకెక్కింది. శ్రీ చక్రాస్ ఎంటర్​టైన్‌మెంట్స్‌ బ్యానర్​పై కృష్ణారెడ్డి నిర్మించారు. సినిమా అంతా ఒకెత్తైతే, ఇంటర్వెల్, క్లైమాక్స్ సీన్స్ మరొకెత్తుగా నిలిచాయని ప్రేక్షకులు చెబుతున్నారు. ఈ రెండూ ప్రేక్షకుల బుర్ర తిరిగిపోయేలా చేస్తాయని కొనియాడుతున్నారు. ఓ కొత్త అనుభూతిని అందించాయని అంటున్నారు. ముఖ్యంగా మనిషి పుట్టుక, కర్మ ఫలం, రుణానుబంధం - ఈ మూడు అంశాల్ని ముడిపెట్టిన దర్శకుడు, చివరికి చెప్పిన సందేశం, కథను ముగించిన తీరు చాలా బాగుందని అభిప్రాయపడుతున్నారు. సినిమాలో మధ్యలో వచ్చే కోర్టు యాక్షన్ సీక్వెన్స్, జాతర పాట, క్లైమాక్స్ ఫైట్ మాస్ ప్రేక్షకులను బాగా అలరించాయి.

'క' కాసుల వర్షం- నాలుగో రోజే అత్యధికం- మొత్తం ఎన్ని కోట్లంటే?

'చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా నిద్రపోతున్నా' - 'క' సక్సెస్​పై కిరణ్ అబ్బవరం

ABOUT THE AUTHOR

...view details