తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'వాళ్లు స్టేట్​మెంట్స్​ మార్చేస్తుంటారు' - సినిమా వసూళ్లపై దిల్‌రాజు కీలక వ్యాఖ్యలు! - Dil Raju On Movie Collections - DIL RAJU ON MOVIE COLLECTIONS

Dil Raju Comments On Movie Collections : సినిమాల వసూళ్లపై టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్​ రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏం అన్నారంటే?

source ETV Bharat
Dil Raju (source ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Oct 3, 2024, 6:39 PM IST

Updated : Oct 3, 2024, 6:44 PM IST

Dil Raju Comments On Movie Collections : సినిమాల వసూళ్లపై టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్​ రాజు కీలక వ్యాఖ్యలు చేశారు! పెద్ద సినిమా విడుదలైన రోజు అభిమానులు, సినీ ప్రియులు నానా హంగామా చేస్తారని, ఆ తర్వాత రెండో రోజు వచ్చేసరికి కొన్ని సందర్భాల్లో పరిస్థితి మారిపోతుంటుందని అన్నారు. తన కొత్త చిత్రం జనక అయితే గనక ఈవెంట్‌లో దిల్​రాజు ఈ విధంగా కామెంట్స్ చేశారు. ఈ సినిమా నచ్చితే బలగం తరహాలో ఆదరించండి అని చెప్పారు. తమ సినిమా కచ్చితంగా నచ్చుతుందని పేర్కొన్నారు.

"సినిమా హిట్ అవుతుందని ఎంత నమ్మకం ఉన్నా, కానీ 5 నుంచి 10 శాతం కచ్చితంగా చెప్పలేం! ఎందుకంటే థియేటర్లలో ఓ సినిమా 100 మందికి నచ్చితే అది క్లాసిక్. 70 మందికి నచ్చితే సూపర్ హిట్, 50 మందికి నచ్చితే హిట్ అవుతుంది. అది క్యాల్కులేషన్​. పెద్ద సినిమాల విషయానికొస్తే మొదటి రోజు సినిమాను తెగ మోసేస్తారు. రెండో రోజు కలెక్షన్స్​ చూసి 'మాకు నచ్చలేదండి, సినిమా హిట్ అండి' అంటారు. అలా రెండో రోజు స్టేట్​మెంట్స్ మారిపోతుంటాయి. మెజారిటీ సినీ ప్రియులు సినిమా చూస్తున్నప్పుడు రకరకాల ఒపినియన్స్​ ఉంటాయి. ఓ సినిమా అందరికీ నచ్చడం అరుదు. మా సినిమా కచ్చితంగా 70 మందికి నచ్చుతుందని నమ్ముతున్నాను. బ్లాక్ బస్టర్ అవుతుంది" అని పేర్కొన్నారు.

Janaka Aithe Ganaka Suhas : కాగా, సుహాస్‌ హీరోగా జనక అయితే గనక తెరకెక్కింది. దర్శకుడు సందీప్‌ బండ్ల తెరకెక్కించారు. దసరా కానుకగా ఈ నెల 12న సినిమా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మీడియాకు ప్రివ్యూ వేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు ప్రెస్‌మీట్‌లో నిర్మాత దిల్‌ రాజు తెలిపారు. సినిమా నచ్చితే బలగం చిత్రంలా ప్రోత్సహించాలని, నచ్చకపోతే విడుదల వరకు సైలెంట్‌గా ఉండాలంటూ సరదాగా చెప్పుకొచ్చాారు.

ఇకపోతే దిల్ రాజు ప్రొడక్షన్​ హౌస్ నుంచి మెగా హీరో రామ్​ చరణ్ గేమ్​ ఛేంజర్ సినిమా కూడా రానుంది. ఈ చిత్రం క్మిస్మస్ కానుకగా రానున్నట్లు సమాచారం. దీని కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

20 రోజల గ్యాప్​లో ఐదు మెగా హీరో సినిమాలు - ఇక బాక్సాఫీస్ దున్నుడే! - Mega Heroes Latest Upcoming Movies

'పుష్ప 2' క్లైమాక్స్​ లేటెస్ట్​ అప్డేట్​ - షూటింగ్ ఎక్కడి దాకా వచ్చిందంటే? - Pushpa 2 Shooting Update

Last Updated : Oct 3, 2024, 6:44 PM IST

ABOUT THE AUTHOR

...view details