తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

జయం రవితో ఎంగేజ్​మెంట్​ - అసలు విషయం చెప్పేసిన ప్రియాంక మోహన్! - JAYAMRAVI PRIYANKA MOHAN ENGAZEMENT

కోలీవుడ్‌ హీరో జయం రవితో ఎంగేజ్​మెంట్​ జరిగినట్లు వచ్చిన వార్తలపై స్పందించిన హీరోయిన్ ప్రియాంక మోహన్‌!

Jayam Ravi Priyanka Mohan Engazement
Jayam Ravi Priyanka Mohan Engazement (source ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Oct 26, 2024, 12:15 PM IST

Jayam Ravi Priyanka Mohan Engazement :కోలీవుడ్‌ హీరో జయం రవి, హీరోయిన్ ప్రియాంక మోహన్‌ ఎంగేజ్​మెంట్​ జరిగిందంటూ ఆ మధ్య పలు వార్తలు వచ్చాయి. ఓ ఫొటో కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్​గా మారింది. తాజాగా దీనిపై ప్రియాంక మోహన్‌ క్లారిటీ ఇచ్చింది. ఆ రూమర్స్​, వార్తలు చూసి తాను షాక్ అయ్యానని చెప్పింది. అసలు ఇలా జరుగుతుందని తాను ఊహించలేదని చెప్పుకొచ్చింది. రూమర్స్​ అన్నీ అవాస్తమని స్పష్టత ఇచ్చింది.

"జయం రవి, నేను కలిసి బ్రదర్‌ సినిమా కోసం పని చేస్తున్నాం. ఆ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా మూవీ టీమ్ ఓ ఫొటో విడుదల చేసింది. ఇందులో మేమిద్దరం మెడలో పూలదండలు వేసుకుని ఉండడంతో అది కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన వారు మాకు ఎంగేజ్‌మెంట్‌ అయిందనే రూమర్ క్రియేట్ చేశారు. నేనేమో వరుస షూట్స్‌తో బిజీగా ఉండటం వల్ల ఆ విషయం గురించి నాకు తెలియలేదు. ఆ తర్వాత కొంతమంది నాకు ఫోన్​ చేసి కంగ్రాట్స్​ చెప్పారు. దీంతో ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదు. ఆ తర్వాత పూర్తి విషయం తెలుసుకుని అది సినిమాలోని స్టిల్‌ అని చెప్పాను. అప్పుడు మా మూవీ టీమ్‌ను కూడా బాగా తిట్టుకున్నాను. మరో ఫొటో ఏదైనా విడుదల చేయొచ్చు కదా అనుకున్నా." అని ప్రియాంక మోహన్‌ పేర్కొంది. ఈ సంఘటన తనకు ఎప్పటికీ గుర్తుండి పోతుందని చెప్పింది.

కాగా, నానీస్‌ గ్యాంగ్‌లీడర్‌ చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమైంది ప్రియాంక మోహన్‌. ప్రస్తుతం ఆమె తెలుగు, తమిళంలో వరుస ప్రాజెక్ట్‌లు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోంది. రీసెంట్​గా విడుదలైన సరిపోదా శనివారంతో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఈ సినిమాలో భాగం కావడం ఆనందంగా ఉందని చెప్పిన ప్రియాంక, ఈ సినిమా కోసం తాము ఎంతో శ్రమించినట్లు తెలిపింది. తమ కష్టానికి తగిన ఫలితాన్ని ప్రేక్షకులు కలెక్షన్స్‌ రూపంలో ఇచ్చారని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె తెలుగులో పవన్ కల్యాణ్ ఓజీ కోసం పని చేస్తోంది. ఇకపోతే ఆమె నటించిన కోలీవుడ్‌ మూవీ బ్రదర్‌ రిలీజ్​కు సిద్ధంగా ఉంది.

'నేనెప్పుడు అది చేయడానికే ప్రయత్నిస్తా' - హీరోయిన్స్ సర్జరీపై కృతి సనన్

టీ20 స్టైల్​లో అందాల భామల దూకుడు - బాక్సాఫీస్ ముందు ఒకేసారి 2,3 చిత్రాలతో

ABOUT THE AUTHOR

...view details