Prashanth Varma Jai Hanuman:'హను- మాన్' సినిమాతో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఇటీవల బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నారు. ఫుల్ ఆఫ్ విజువల్స్, గ్రాఫిక్స్‌తో హాలీవుడ్ లెవెల్లో తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇక ప్రశాంత్ వర్మ యూనివర్స్‌లో ఈ సినిమాకు సీక్వెల్‌గా 'జై హనుమాన్' మూవీ రానుందని ఇప్పటికే డైరెక్టర్ ప్రకటించారు. దీంతో ఈ సీక్వెల్‌పై కూడా అంచనాలు అమాంతం పెరిగాయి. ఇక ఈ మూవీ 2025లో రిలీజ్ కానుందని చెప్పారు. అయితే ఇక్కడే ప్రశాంత్ ఓ ట్విస్ట్ ఇవ్వనున్నారు.
'హను- మాన్' సినిమా వల్ల ప్రశాంత్ వర్మకు దేశవ్యాప్తంగా క్రేజ్ వచ్చింది. ఈ క్రమంలో నార్త్, హిందీ బెల్ట్‌లోనూ ఈ సినిమా భారీ వసూళ్లు సాధించింది. దీంతో బాలీవుడ్‌లోనూ ప్రశాంత్ పేరు బాగా వినిపించింది. ఫలితంగా ప్రశాంత్ బాలీవుడ్లో ఓ సూపర్ ఛాన్స్ పట్టేశారు. బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్, ప్రశాంత్‌తో ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో 'జై హనుమాన్' సినిమాను హోల్డ్‌లో పెట్టి రణ్వీర్ హిందీ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించాలని ప్రశాంత్ డిసైడైనట్లు సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. ఇక ఈ ప్రాజెక్ట్‌ను 2025 లోనే కంప్లీట్ చేయలని ప్రశాంత్ భావిస్తున్నారట.
ఈ సినిమా కూడా ప్రశాంత్ వర్మ యూనివర్స్ (PVCU)లో భాగంగా సూపర్ హీరో కాన్సెప్ట్‌తోనే తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. అటు రణ్వీర్ కూడా సూపర్ హీరో సినిమా చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారట. దీంతో ఇది బాలీవుడ్‌లోనూ హాట్ టాపిక్‌గా మారింది. ఒకవేళ ఇదే నిజమైతే 'జై హనుమాన్' కోసం ప్రేక్షకులు 2026 దాకా ఆదాల్సిందే! ఇక ఈ ప్రాజెక్ట్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీమేకర్స్ రూపొందిచనుందని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా కోసం ప్రొడక్షన్ హౌస్ కూడా భారీ మొత్తంలో ఖర్చు చేయడానికి సిద్ధమైనట్లు సమాచారం.