Prasanth Varma Mokshagna Movie :'హనుమాన్' ఫేమ్ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, నందమూరి నటవారసుడు మోక్షజ్ఞ కాంబినేషన్లో సినిమా ఫిక్స్ అయ్యింది! గతకొద్ది రోజులుగా వస్తున్న ఈ రూమర్స్‌ను నిజమే అన్నట్లు తాజాగా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఓ స్పెషల్ ఫోటో పెట్టి హింట్ ఇచ్చారు. 'లయన్ కింగ్' సినిమాలో చిట్టి సింబాను పరిచయం చేసే సీన్‌కు సంబంధించిన ఫొటోను పంచుకుని "నా యూనివర్స్ నుంచి త్వరలోనే ఓ కొత్త తేజస్సు రానుంది. సింబా ఈజ్ కమింగ్" అంటూ క్యాప్షన్ జోడించారు.
ఇది చూసిన అభిమానులు ఈయన పెట్టిన పోస్ట్ కచ్చితంగా మోక్షజ్ఞ గురించే అని కామెంట్లు పెడుతున్నారు. త్వరగా అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చేయండి అంటూ ప్రశాంత్ వర్మను రిక్వెస్ట్ చేస్తున్నారు.
మోక్షూ కోసం బాలయ్య స్పెషల్ అప్డేట్
అయితే ఈ సినిమా నుంచి మరో కీలక అప్డేట్ తాజాగా బాలయ్యనే స్వయంగా వెల్లడించారు. అదేంటంటే ఈ చిత్రానికి తన కుమార్త తేజస్వినీనే ప్రొడ్యూసర్‌గా వ్యవహరించనున్నట్లు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అయితే ఈ విషయంపై సెప్టెంబర్ 6న మోక్షజ్ఞ బర్త్‌డే సందర్భంగా అఫీషియల్ అనౌన్స్మెంట్ రానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే డైరక్టర్ ప్రశాంత్ వర్మ ఈ సినిమా కోసం ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్నట్లు తెలుస్తుంది. అక్టోబరులో మొదలుపెట్టాలనుకుంటున్న ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. డైరక్టర్, ప్రొడ్యూసర్ దాదాపు కన్ఫమ్ అయిపోగా మిగిలిన నటీనటులు ఎవరనేది తెలుసుకునేందుకు కొన్ని రోజులు వెయిట్ చేయకతప్పదు మరి.