తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

PVCUలో ప్రభాస్ సినిమా - ప్రశాంత్ వర్మతో మూవీకి డార్లింగ్ ఓకే! - PRABHAS PRASHANTH VARMA MOVIE

పాన్ఇండియా స్టార్లు ప్రభాస్ - ప్రశాంత్ వర్మ కాంబోలో ఓ సినిమా రానున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్​ కోసం PVCUలో ప్రశాంత్ ఎలాంటి స్టోరీ రెడీ చేశాడోనని ఫ్యాన్స్ ఆత్రుతగా చూస్తున్నారు.

Prabhas Prashanth Varma Movie
Prabhas Prashanth Varma Movie (Source: Getty Images)

By ETV Bharat Telugu Team

Published : Oct 18, 2024, 8:23 PM IST

Prabhas Prashanth Varma Movie :పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన వరుసగా ఐదు సినిమాలు లైన్​లో పెట్టారు. ప్రస్తుతం రాజాసాబ్ షూటింగ్​లో పాల్గొంటున్నారు. అయితే తాజాగా మరో మూవీకి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. 'హనుమాన్‌' మూవీతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మతో ప్రభాస్ సినిమా చేయనున్నారని సమాచారం. దీనికి సంబంధించిన కథని కూడా ప్రభాస్‌ ఓకే చేశారట.

ప్రస్తుతం ఈ కాంబో గురించి సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. దీనికి తోడు శుక్రవారం సాయంత్రం ప్రశాంత్ వర్మ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ఎక్స్‌లో ఓ ఇమోజీ (Emoji)తో పోస్ట్ షేర్ చేశారు. దీంతో ఈ ప్రచారనికి మరింత బలం చేకూరింది. ఇక ప్రభాస్- ప్రశాంత్ వర్మ మూవీ ఫిక్స్ అయ్యింది అంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఈ ఇద్దరి కాంబోలో మూవీ ఎప్పుడు మొదలవుతుందా? ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీంతో ప్రశాంత్‌ వర్మ- ప్రభాస్‌ సినిమా గురించి వార్త నెట్టింట్లో వైరల్‌గా మారింది.

అప్పుడే ప్రకటన
అయితే అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడుతుందని టాక్ వినిపిస్తోంది. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోందని సమాచారం. ఈ కాంబినేషన్‌లో మూవీ వస్తే అది సోషియో ఫాంటసీనా లేక ఫుల్‌ యాక్షన్ ఎంటర్‌టైనరా? అని అప్పుడే ఫ్యాన్స్‌ చర్చించుకోవడం మొదలు పెట్టారు.

​కాగా, ప్రభాస్ రీసెంట్ బ్లాక్​బస్టర్ కల్కి 'AD 2898'లో కూడా పలు ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో నటించారు. బాలీవుడ్ నుంచి బిగ్​బి అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, దిశా పటానీ, కోలీవుడ స్టార్ కమల్ హాసన్, దుల్కర్ సల్మాన్ తదితరులు నటించారు. దీంతో స్పిరిట్​లో కూడా ప్రముఖులు నటించే ఆవకాశం ఉందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఇక నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సినిమా జూన్ 27న రిలీజైంది. లాంగ్​ రన్​లో వరల్డ్​ వైడ్​గా రూ. 1100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

ABOUT THE AUTHOR

...view details